విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల season . త్వరలో Tenth, Inter and Degree పరీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయం కావడంతో విద్యార్థుల్లో కొంత ఒత్తిడి ఉందనే చెప్పాలి. అయితే ఆ ఒత్తిడిని పక్కనబెట్టి స్నేహితులు, కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు సెలవులు వస్తున్నాయి. ఒకటికి బదులు మూడు రోజులు సెలవులు ఉంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు వచ్చే నెల March లో ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని March 08న (శుక్రవారం) సెలవు ఉంటుంది. అదేవిధంగా, March 09 రెండవ శనివారం సెలవు. 10వ తేదీ ఆదివారం కావడంతో మూడు రోజుల పాటు పాఠశాలకు సెలవు. వరుస సెలవులు రావడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. పుస్తకాలతో కుస్తీ పడుతుండగా.. సెలవులు రావడంతో కాస్త ఉపశమనం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు