
గూగుల్ అభిమానులకు ఇది చాలా పెద్ద న్యూస్. కొత్తగా లీకైన సమాచారం ప్రకారం, త్వరలో విడుదలకానున్న Pixel 10 సిరీస్ ఫోన్ల వివరాలు బయటపడ్డాయి. పాపులర్ లీకర్ అర్సేన్ లుపిన్ షేర్ చేసిన ఈ లీక్ ద్వారా నాలుగు పిక్సెల్ ఫోన్ల యొక్క స్టోరేజ్, కలర్ ఆప్షన్లు ముందుగానే తెలిసిపోయాయి. ఇవి Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold ఫోన్లు.
గూగుల్ సాధారణంగా అక్టోబర్‌లో తన కొత్త ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ ఈసారి ఆగస్టు కూడా రాకముందే ఈ సిరీస్ పై క్లారిటీ వచ్చింది. అందుకే ఇప్పుడు నుంచే Pixel 10 ఫోన్ల హైప్ మొదలైంది.
Pixel 10 మోడల్‌ను చూస్తే, ఇది సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడింది. ఇందులో 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. మీరు ఎక్కువగా ఫోటోలు, వీడియోలు దాచుకోరు కానీ పిక్సెల్ అనుభూతిని కోరుకుంటే ఇది బెస్ట్.
ఇది నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది – Obsidian (బ్లాక్), Frost (వైట్), Lemongrass (పచ్చటి పసుపు), Indigo (నీలం). న్యూట్రల్ కలర్స్ తో పాటు బోల్డ్ ఫినిష్ ఉన్న కలర్ టోన్స్ కూడా ఉన్నాయి. స్టార్ట్ంగ్ ప్రైస్ ₹80,000 వరకు ఉండొచ్చు అనే అంచనా.
Pixel 10 Pro మోడల్ అత్యధిక ఫీచర్లతో వస్తుంది. ఇందులో 128GB, 256GB, 512GB మరియు 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి. ఇది చూసి స్పష్టంగా తెలుస్తోంది – ఇప్పుడు చాలా మంది పెద్ద స్టోరేజ్ ఉన్న ఫోన్లకే మొగ్గు చూపుతున్నారు.
ఇది వచ్చే కలర్ ఆప్షన్లు – Obsidian, Porcelain (ఆఫ్ వైట్), Moonstone (పచ్చటి గులాబీ), Jade (లైట్ గ్రీన్). ప్రొఫెషనల్ లుక్ కోరుకునేవారికి ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్. దీని ధర ₹1,00,000 నుంచి ప్రారంభమవొచ్చు.
Pixel 10 Pro XL మోడల్ 256GB నుంచి 1TB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. అంటే ఇది 128GB వేరియంట్‌ను స్కిప్ చేసింది. దీని ఉద్దేశం క్లియర్ – పెద్ద స్క్రీన్, పెద్ద స్టోరేజ్ కావాలనుకునే యూజర్ల కోసం.
ఇది కూడా Obsidian, Porcelain, Moonstone, Jade కలర్ ఆప్షన్లలోనే వస్తుంది. పెద్ద డిస్ప్లే, ఫుల్ డే యూజ్ కోసం బెటర్ బాటరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీని ధర ₹1.15 లక్షల వరకు ఉండొచ్చు.
Google ఈసారి తన ఫోల్డబుల్ లైన్అప్లో కూడా బంపర్ అప్‌గ్రేడ్ ఇస్తోంది. Pixel 10 Pro Fold మోడల్ 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. కానీ, ఇది కేవలం రెండు కలర్ ఆప్షన్ల్లోనే లభిస్తుంది – Moonstone, Jade.
బ్లాక్ లేదా వైట్ లాంటి సాధారణ రంగులు లేకపోవడం ఆశ్చర్యకరం. కానీ కొత్త లుక్స్ కోరుకునే వాళ్లకు ఇది స్పెషల్ ఫీల్ ఇవ్వొచ్చు. దీని ధర ₹1.50 లక్షల నుంచి ప్రారంభమవొచ్చని టెక్ ప్రపంచం ఊహిస్తోంది.
ఈసారి గూగుల్ అన్ని రకాల యూజర్లను దృష్టిలో పెట్టుకుని వేరియంట్లను ప్లాన్ చేసింది. స్టార్ట్ వేరియంట్లు 128GB నుంచి మొదలై, టాప్ వేరియంట్లలో 1TB స్టోరేజ్ వరకు ఉండటం చూడ్డానికి హైపే.
ముందు ఉన్న Pixel 8/9 సిరీస్ మోడళ్లతో పోలిస్తే, ఈ సారి స్టోరేజ్, కలర్స్, స్క్రీన్ సైజ్ అన్నింటిలోనూ స్పష్టమైన మార్పు ఉంది. ఈ లీక్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు కానీ అర్సేన్ లుపిన్ లీక్స్ గతంలో చాలాసార్లు నిజం అయ్యాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్, సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ హైడిమాండ్లో ఉన్నాయి. కానీ Pixel 10 సిరీస్ ఈసారి వాటికి పోటీ ఇచ్చేలా తయారవుతోంది. 1TB వరకు స్టోరేజ్, ఫోల్డబుల్ ఆప్షన్, కొత్త కలర్స్, అద్భుతమైన కెమెరా క్వాలిటీ – ఇవన్నీ చూస్తే, గూగుల్ ఫోన్లకు దీర్ఘకాలం తర్వాత సరైన హైప్ వచ్చింది.