BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మీకోసమే!

ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ BSNL తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు తమ వినియోగదారులకు సరసమైన, దీర్ఘకాలిక చెల్లుబాటు ఎంపికలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. BSNL ఈ రెండు ప్లాన్లలో అపరిమిత కాలింగ్, ఉచిత SMS మరియు హై-స్పీడ్ డేటా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ.215 కు, మరొకటి రూ.628 కు లభిస్తుంది. ఇప్పుడు ఈ రెండు ప్లాన్ల గురుంచి చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రూ. 215 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.215 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. అదే సమయంలో వినియోగదారుడు ప్రతిరోజూ 2GB డేటాను పొందొచ్చు. అంటే.. నెలకు మొత్తం 60GB డేటా వస్తుంది. ఇది కాకుండా.. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు లభిస్తాయి. భారతదేశం అంతటా అపరిమిత లోకల్, STD కాల్స్ చేయవచ్చు. ఈ ప్లాన్ లో నేషనల్ రోమింగ్ ఉచితం. విలువ ఆధారిత సేవల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో జింగ్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, మరెన్నో ఉన్నాయి.

Related News

రూ.628 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ తో, 84 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ప్రతిరోజూ 3GB డేటా లభిస్తుంది. అంటే.. 84 రోజుల్లో మొత్తం 252GB డేటాను వస్తుంది. ఈ ప్లాన్ లో కూడా ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. భారతదేశం అంతటా అపరిమిత లోకల్, STD కాలింగ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో నేషనల్ రోమింగ్ ఉచితం. విలువ ఆధారిత సేవల గురించి మాట్లాడుకుంటే.. జింగ్ మ్యూజిక్‌తో పాటు, BSNL ట్యూన్స్, మరెన్నో అందుబాటులో ఉన్నాయి.