AP ప్రజలకు గుడ్ న్యూస్ . ఇవాళ వారందరి ఖాతాల్లో డబ్బులు జమ! హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఏపీలో కోడ్ (Model Code of Conduct – MCC) అమల్లోకి వచ్చింది. దీంతో వివిధ పథకాల అమలుకు బ్రేక్ పడింది. తాజాగా ఏపీ ప్రజలకు హైకోర్టు శుభవార్త చెప్పింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల నిధులు నేడు జమ అయ్యాయి. అయితే ఈ నిధులు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఏపీ ప్రజలకు శుభవార్త. ఈరోజు (శుక్రవారం 10) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల నిధులు జమ కానున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు ఆసరా, ఈ బీసీ నేస్తం, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ, అందజేత నిధులు విడుదల చేయరాదని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ ఒక్కరోజే నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద రూ.5060.49 కోట్లు, ఆసరా పథకం కింద రూ.6394 కోట్లు, వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు రూ.78.53 కోట్లు. కోట్లు, జగనన్న విద్యా దీవెన రూ. 708.68 కోట్లు, రైతు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1294.59 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ రూ.629.37 కోట్లు. కోట్లు పంపిణీ చేస్తారు.

Related News

ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారుల ఖాతాల్లో పథకాల నిధులు జమ చేయవద్దని ఆదేశించారు. అంతే కాదు.. పోలింగ్ అనంతరం పథకాల నిధులు విడుదల చేయాలనే ఈసీ ఆదేశాలను ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా పక్కన పెట్టడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదల విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదన్నారు. నిధుల పంపిణీ వ్యవహారాన్ని ప్రచారం చేయవద్దని స్పష్టం చేసిన కోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. నిధుల పంపిణీ సమయంలో రాజకీయ నేతల ప్రమేయం ఉండరాదని, సంబరాలు, ప్రచారాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 27కి వాయిదా పడింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *