ఆర్బీఐ తాజా నిర్ణయం తర్వాత బ్యాంకులు FD వడ్డీ తగ్గించేస్తున్నాయ్. ఎవరికి ఎన్ని శాతం వడ్డీ వస్తుందో, ఎక్కడ పెట్టితే ఎక్కువ లాభం అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
FD వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయ్ – ఎందుకు?
కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 6.50% నుంచి 6.25%కి తగ్గించింది.
- దీనివల్ల బ్యాంకులు రుణాలపై వడ్డీ తగ్గించాల్సి వచ్చింది.
- కానీ, అదే సమయంలో FDలపై వడ్డీ రేట్లు కూడా తగ్గించడం మొదలుపెట్టాయి.
- ఇప్పటికే కొన్ని బ్యాంకులు తగ్గించగా, మరికొన్ని త్వరలో తగ్గించే అవకాశం ఉంది.
కాబట్టి ఎఫ్‌డీ పెట్టాలని అనుకుంటున్నవాళ్లు ఆలస్యం చేస్తే వడ్డీ తగ్గిపోతుంది
Related News
ఏ బ్యాంకులో FD వడ్డీ ఎంత ఉంది?
ఇప్పటికీ ఏడాది టెన్యూర్ FDలపై కొన్ని బ్యాంకులు మంచి వడ్డీ ఇస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
బ్యాంక్ పేరు | ఎఫ్‌డీ వడ్డీ రేటు (%) | ₹10 లక్షల FDకి వచ్చే వడ్డీ (రూ.) |
---|---|---|
బంధన్ బ్యాంక్ | 8.05% | ₹80,277 |
ఇండస్‌ఇండ్ బ్యాంక్ | 7.75% | ₹77,287 |
యెస్ బ్యాంక్ | 7.75% | ₹77,287 |
ఆర్బీఎల్ బ్యాంక్ | 7.50% | ₹74,793 |
కర్ణాటక బ్యాంక్ | 7.25% | ₹72,305 |
డీసీబీ బ్యాంక్ | 7.10% | ₹70,807 |
సీనియర్ సిటిజెన్స్‌కి ఈ రేట్లకంటే 0.50% ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
FD పెట్టడానికి ఇదే సరైన సమయం
- ఎక్కువ వడ్డీ ఉన్నప్పుడే డిపాజిట్ పెట్టుకోవడం మంచిది.
- ఒకసారి FD పెట్టిన తర్వాత, ఆ వడ్డీ రేటు టెన్యూర్ పూర్తయ్యే వరకు మారదు!
- దీంతో భవిష్యత్తులో వడ్డీ తగ్గినా, మీకు ప్రస్తుత రేటుతో మంచి రిటర్న్స్ వస్తాయి.
కాబట్టి ఆలస్యం చేయకుండా మీ FDని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి! వడ్డీ తగ్గిన తర్వాత FD పెడితే నష్టపోతారు.