సంధ్య థియేటర్ ఘటన తర్వాత భారీ సినిమా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అమెరికాలో డాకు మహారాజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా, చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఏపీలో జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర సినీ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు తూ.గో.జిల్లా కడియం మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న లేఅవుట్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్వాహకులు ఇప్పటికే అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, చిత్ర బృందం ముఖ్య అతిథులుగా వస్తుండడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వేదిక వద్ద ఏర్పాట్లను ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లక్ష మంది అభిమానులు తరలి వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేదికను పది అడుగుల ఎత్తులో నిర్మించారు. వేదిక పరిసరాల్లోకి ఎవరూ రాకుండా భద్రతా చర్యలు చేపట్టారు. 400 మంది పోలీసులు, 1200 మంది పోలీసులు ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. 20,000 వాహనాలు నిలిచేందుకు మైదానానికి సమీపంలో ఐదు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. వేదిక ముందున్న బారికేడ్లు, హైమాక్స్ లైట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అభిమానులను హెచ్చరిస్తున్నారు. అభిమానులు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేమంగా ఉండాలని సూచించారు.
Related News
గేమ్ ఛేంజర్ ఈవెంట్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం జరిగే మైదానానికి సమీపంలోని వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు తెలిపారు. అటువైపు వచ్చే భారీ వాహనాలను దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద ఉన్న గోదావరి నాల్గవ వంతెనపై నుంచి మళ్లిస్తున్నట్లు తెలిపారు.