దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ఈ పథకంలో ప్రతినెలా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు.
ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు మరియు పంచాయతీలు తమ అధికార పరిధిలో rooftop solar system ను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అదే సమయంలో ఈ పథకం వల్ల ఎక్కువ ఆదాయం, తక్కువ కరెంటు బిల్లులు, ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి? దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం
Related News
♦ ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్సైట్ను తెరవండి.
♦ Apply for Rooftop Solar option పై క్లిక్ చేయండి
♦ మీరు ఈ వివరాలతో ముందుగా నమోదు చేసుకోవాలి – రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారు సంఖ్య, Mobile Number, email వివరాలు.
♦ పూర్తయిన తర్వాత, మీరు మీ Mobile Number తో lOgin అవ్వాలి.
♦ మీరు ఇప్పుడు Solar panel కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియలో బ్యాంక్ వివరాలను సమర్పించాలి.
♦ మీరు ఆమోదం పొందిన తర్వాత, మీ డిస్కామ్లో నమోదిత విక్రేతలలో ఒకరు ప్లాంట్ను ఇన్స్టాల్ చేయాలి.
♦ ఇనెట్ మీటర్ అమర్చిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీలు చేపడతారు. ఆ తర్వాత పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
♦ ఈ నివేదికను పొందిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు రద్దు చేయబడిన చెక్కును పోర్టల్లో సమర్పించండి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.