ఈరోజుల్లో ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఎంత ప్రాచుర్యం పొందినవో అందరికీ తెలిసిందే. ఓటిటి కంటెంట్ వినియోగం కూడా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత సబ్స్క్రిప్షన్ల కోసం వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయితే మీరు ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందవచ్చు. అవును.. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు తమ వినియోగదారులకు ఉచిత ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు అందిస్తున్నాయి. వీటితో ఓటిటి కంటెంట్ కు అదనపు చెల్లింపులు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఇకపోతే ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉచితంగా వస్తుంది. ఈ ప్లాన్లలో రోజు వారి డేటా మంచి మొత్తంలో ఉంటుంది. మరి ఇప్పుడు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎయిర్‌టెల్ లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్లలో వస్తుందో చూద్దాం.
ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 3GB డేటా ను ఎంజాయ్ చేయొచ్చు. ఇక రోజుకు 100 SMSలు పంపించుకునే సదుపాయం వస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 56 రోజుల పాటూ ఫ్రీ గా ఆస్వాదించవచ్చు. ఉచిత హలోట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్ పొందవచ్చు.
Related News
ఎయిర్‌టెల్ రూ. 1,199 ప్లాన్
ఈ రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో రోజుకు 2.5GB డేటా ను ఎంజాయ్ చేయొచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 84 రోజు పాటూ వీక్షించవచ్చు. అపరిమిత 5G డేటా, ఉచిత HelloTunes, అపోలో 24/7 సర్కిల్, Rewards Mini సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తాయి.