విద్యార్థులకు శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన బలాన్ని చూపిస్తున్నాడు. ఉదయం నుంచి ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు అశాంతికి గురవుతున్నారు. ఎండలతో పాటు తీవ్రమైన వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుతున్న ఎండలకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు చక్కని వార్త అందింది.
మార్చి 14 (శుక్రవారం) హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు కాబట్టి, విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత, మార్చి 15 (శనివారం), 16 (ఆదివారం వారాంతం) కూడా కార్పొరేట్ కంపెనీలు, కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగులకు సెలవులు. దీనితో, వరుసగా మూడు సెలవులు ఉంటాయి.