EV Cars: పంచ్, ఇన్‌స్టర్, సిట్రోయెన్.. ఈ మూడు EV కార్ల మధ్య తేడా ఏమిటి?

EV Cars: ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు ట్రెండ్ అవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల (EV)పై కొందరికి అనేక సందేహాలు ఉన్నాయి. వాటిలో Tata Punch, Hyundai Inster, Citroen EVలు ఒకదానికొకటి బాగా పోటీ పడుతున్నాయి. అయితే ఈ లక్షణాలు ఏమిటి? ఈ మూడు కార్ల మధ్య తేడా ఏమిటి? అనే సందేహాలు ఉన్నాయి. తేడాలు ఏమిటో చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి కంపెనీలలో ఒకటైన Hyundai company , 2024 Busan International Mobility Show  EVని ప్రదర్శించింది. త్వరలో మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. హ్యుందాయ్ ఇన్‌స్టర్ వీల్‌బేస్ 2,580. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది 9 BHP నుండి 115 BHP వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇన్‌స్టర్‌లో 42 kWh మరియు 49 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది 120 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్‌తో అమర్చబడి 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది. మొత్తం 4 గంటల 35 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని ధర ఇంకా ప్రకటించనప్పటికీ 10.99 లక్షల నుంచి 15.49 లక్షల మధ్య విక్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరో కంపెనీ Tata Punch EV పొడవు 1,742 మిమీ. ఇందులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. Tata Punch 122 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 25 కిలోవాట్ లేదా 35 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 56 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. మొత్తంగా పూర్తి ఛార్జింగ్ కోసం 9 నుండి 13 గంటల సమయం పడుతుంది. Tata PunchEV ధర 10.99 లక్షల నుండి 13.79 లక్షల వరకు ఉంటుంది.

Related News

మూడవ EV Citroen పొడవు 3,981 mm. ఇది 57 బిహెచ్‌పి పవర్ మరియు 143 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయెన్ 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 57 నిమిషాల్లో 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సిట్రోన్ రూ.11.61 నుంచి రూ.13.41కి విక్రయిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *