పర్సనల్ లోన్ తీసుకున్నవారు ముందుగానే మొత్తం చెల్లించి లోన్ క్లోజ్ చేయాలా? లేదా ఎంఐయేలు కడుతూ కొనసాగించాలా? అనేది చాలా మందికి పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ముందుగా లోన్ క్లోజ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ నుంచి విముక్తి, క్రెడిట్ స్కోర్ మెరుగవడం లాంటి లాభాలు ఉన్నాయి.
కానీ అంతా మంచే కాదు, ఇందులో కొన్ని ముగింపు ఛార్జీలు, లిక్విడిటీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు, లాభనష్టాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి
లోన్ క్లోజ్ అంటే ఏంటి?
మీరే స్వచ్ఛందంగా తర్వాత మిగిలిన అన్ని ఇఎంఐలతో సహా మొత్తం లోన్‌ను ముందుగానే కట్టేసే ప్రక్రియ. ఇది చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ వాడకూడదనుకున్నప్పుడు లేదా ఎక్కువ డబ్బు చేతిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం.
Related News
ముందుగా పర్సనల్ లోన్ క్లోజ్ చేస్తే కలిగే లాభాలు
- ఇంట్రెస్ట్ ఆదా – ఎక్కువ కాలం లోన్ కొనసాగిస్తే ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ముందుగా క్లోజ్ చేస్తే ఈ అదనపు ఖర్చు మటుమాయమవుతుంది.
- క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది – ఒక లోన్ క్లోజ్ చేయడం ద్వారా మీ రుణ చరిత్ర మరింత బలంగా ఉంటుంది, భవిష్యత్తులో కొత్త లోన్స్ పొందడం సులభం.
- ఆర్థిక భారం తగ్గుతుంది – ఎంఐయేలు లేకపోవడంతో ఇతర పెట్టుబడులకు, సేవింగ్‌కి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ముందుగా లోన్ క్లోజ్ చేస్తే వచ్చే నష్టాలు
- ముందుగా క్లోజ్ చేయడానికి ఛార్జీలు ఉంటాయి – బ్యాంకులు సాధారణంగా 2% నుండి 6% వరకు ప్రీ-క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి, ఇది మీ ఆదా చేసే వడ్డీని తగ్గించేస్తుంది.
- ఇతర పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోతారు – మీరు లోన్ క్లోజ్ చేయడానికి ఉపయోగించే డబ్బును షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పెట్టుబడుల్లో పెడితే ఎక్కువ లాభం రావచ్చు.
- లిక్విడిటీ సమస్య – మొత్తం డబ్బును లోన్ క్లోజ్‌కు కేటాయిస్తే, తరువాత అత్యవసర ఖర్చులకు, ఇతర పెట్టుబడులకు డబ్బు లేకపోవచ్చు.
కొత్త RBI మార్గదర్శకాలు
- ఫిబ్రవరి 21, 2025న RBI ఫ్లోటింగ్ రేట్ లోన్స్‌పై ప్రీపేమెంట్ ఛార్జీలు రద్దు చేసే ప్రతిపాదనను విడుదల చేసింది.
- దీనిపై ప్రజల అభిప్రాయాలు మార్చి 21, 2025లోపు కోరారు.
- ఈ మార్గదర్శకాలు అమలైతే, ముందుగా లోన్ క్లోజ్ చేసే వారికి కొత్తగా మేలు జరగొచ్చు
క్లోజ్ చేయాలా? చేయకూడదా?
- మీ చేతిలో ఎక్కువ డబ్బు ఉంటే ముందుగా క్లోజ్ చేసి ఇంట్రెస్ట్ ఆదా చేసుకోవచ్చు.
- బ్యాంక్ ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఎక్కువగా ఉంటే వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి.
- డబ్బు మొత్తం ఒకేసారి ఖర్చు చేస్తే తరువాత అత్యవసరాలకు డబ్బు ఉండదని ఆలోచించాలి.
మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోండి. ముందుగా లోన్ క్లోజ్ చేయడం లాభమా? నష్టమా? మీరే తేల్చుకోండి.