₹5 లక్షల ఫ్రీ ట్రీట్మెంట్ మిస్స్ అయితే జీవితాంతం ఖర్చులే… ఇప్పుడే ఈ కార్డ్ తీసుకోండి…

ఆరోగ్యం సంపద కంటే ఎక్కువ… ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఆనందంగా బతకడం కష్టం. అందుకే కుటుంబాన్ని అనారోగ్య ఖర్చుల నుండి కాపాడుకోవడానికి చాలా మంది ముందుగా ప్లాన్ చేస్తున్నారు.

ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్

ప్రస్తుత రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువ. అందుకే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఆర్థిక స్థోమత ఉండదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

₹5 లక్షల ఉచిత వైద్యం అందించే “ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన”..

కేంద్ర ప్రభుత్వం 2018లో “ఆయుష్మాన్ భారత్ యోజన” (PMJAY)ను ప్రారంభించింది.

  •  ఈ స్కీమ్ ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతి ఏడాది ₹5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది.
  •  ప్రైవేట్ & ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఈ ట్రీట్మెంట్ పొందొచ్చు.
  •  దీనికోసం “ఆయుష్మాన్ కార్డ్” అందించబడుతుంది.

ఆయుష్మాన్ కార్డ్ పోయిందా? చినిగిందా? టెన్షన్ పడొద్దు

కొంతమంది ఆయుష్మాన్ కార్డ్ పోగొట్టుకుంటారు లేదా డ్యామేజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఉచిత వైద్యం పొందలేరా? అంటే కాదు.

Related News

కార్డ్ లేకపోయినా ఇలా ట్రీట్మెంట్ పొందొచ్చు

  1.  మీరు ఏ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ “ఆయుష్మాన్ మిత్ర హెల్ప్‌డెస్క్”కి వెళ్లండి.
  2.  మీ ఆయుష్మాన్ కార్డ్ మిస్సైందని లేదా డ్యామేజ్ అయ్యిందని చెప్పండి.
  3.  మీ కార్డ్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వండి.
  4.  అక్కడి ఆపరేటర్ మీ డీటైల్స్ వెరిఫై చేసి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కల్పిస్తారు.
  5.  ఏమైనా సమస్యలు వస్తే 14555 నంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ పెట్టుకోవచ్చు.

ఎవరు అర్హులు?

  •  కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న “SECC డేటా”లో అర్హులుగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ కార్డ్ ఇస్తారు.
  •  దీని కోసం సదరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత డబ్బు కోసం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆయుష్మాన్ కార్డ్ తీసుకొని కుటుంబ భద్రతను పొందండి.

₹5 లక్షల ఉచిత వైద్యం మిస్సైతే జీవితాంతం ఖర్చులే. ఇప్పుడే ఈ కార్డ్ కోసం అప్లై చేయండి.