మన క్రెడిట్ స్కోర్ అంటే, మనకు అప్పు ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మనను నమ్మే ఆధారం. ఈ స్కోర్ ఆధారంగానే మనకు లోన్ ఇచ్చేది, క్రెడిట్ కార్డు ఇచ్చేది జరుగుతుంది. కానీ చాలా మందికి స్కోర్ తగ్గిపోవడానికి కారణం వారికే తెలియదు. ఎందుకంటే స్కోర్ తగ్గేలా చేసేది మన వెనక జరిగే కొన్ని “ఇంక్వయిరీలు”.
ఈ ఇంక్వయిరీలు రెండు రకాలుగా ఉంటాయి – సాఫ్ట్ ఇంక్వయిరీ (Soft Inquiry) & హార్డ్ ఇంక్వయిరీ (Hard Inquiry). ఇవి ఏంటో, మన స్కోర్‌కి ఎలా ప్రభావం చూపుతాయో ఈ కథనం చదివితే తెలుస్తుంది.
సాఫ్ట్ ఇంక్వయిరీ అంటే ఏమిటి?
సాఫ్ట్ ఇంక్వయిరీ అంటే మన క్రెడిట్ స్కోర్‌ను కేవలం చూసే ప్రయత్నం మాత్రమే. దీనికోసం మన అనుమతి అవసరం ఉండదు. ఉదాహరణకి, మీరు మీ స్కోర్‌ను క్రెడిట్ స్కోర్ యాప్‌లలో చెక్ చేసినా, కొన్ని కంపెనీలు మీరు అప్లై చేయకపోయినా ఒక ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఇచ్చినా. అప్పుడు చేసే స్కోర్ చెకింగ్‌నే ‘సాఫ్ట్ ఇంక్వయిరీ’ అంటారు.
Related News
ఇది మీ స్కోర్‌ను తగ్గించదు
అంటే మీరు నెలకి ఒకసారి స్కోర్ చెక్ చేసినా, సాఫ్ట్ ఇంక్వయిరీ ద్వారా చేస్తే స్కోర్ తగ్గే భయం లేదు.
హార్డ్ ఇంక్వయిరీ అంటే ఏమిటి?
ఇది మాత్రం సీరియస్. హార్డ్ ఇంక్వయిరీ మీరు ఏదైనా క్రెడిట్ ప్రొడక్ట్‌కి అప్లై చేసినప్పుడు – ఉదాహరణకి, పర్సనల్ లోన్, హోం లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ వంటివి. మీరు అప్లికేషన్ సమర్పించాక, ఆ బ్యాంక్ లేదా NBFC మీ స్కోర్‌ను చెక్ చేస్తే అది హార్డ్ ఇంక్వయిరీ అవుతుంది.
ఇది మీ స్కోర్‌ను తక్కువ చేస్తుంది
ఒక్క హార్డ్ ఇంక్వయిరీ చేస్తే దాదాపు 5-10 పాయింట్లు స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ లోన్లు లేదా కార్డులకి అప్లై చేస్తే, మరింత ఎక్కువగా స్కోర్ పడిపోవచ్చు.
హార్డ్ ఇంక్వయిరీ ఎందుకు సమస్య?
1. మీకీ ఫైనాన్స్ మీద చాలా డిపెండెన్సీ ఉందేమో అనే అనుమానం వస్తుంది.
2. బ్యాంక్‌లు మీరు డబ్బు తిసేసి తిరిగి చెల్లించకపోవచ్చు అనుకోవచ్చు.
3. స్కోర్ తక్కువగా ఉంటే రిజెక్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి.
ఇవి మీ భవిష్యత్ లోన్ అప్లికేషన్ల మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపించొచ్చు.
ఇక ముందు మీరు చేయాల్సినవి
స్కోర్ చెక్ చేయడం వల్ల స్కోర్ తగ్గిపోతుందనే భయం వద్దు. అది సాఫ్ట్ ఇంక్వయిరీ అయి ఉంటే ఎఫెక్ట్ ఉండదు. ఒకేసారి ఎక్కువ లోన్లకు అప్లై చేయకండి. హార్డ్ ఇంక్వయిరీలు ఎక్కువైతే స్కోర్ పడిపోతుంది. ఒక కొత్త క్రెడిట్ కార్డు అవసరమైతే మంచి ఆఫర్ చూసుకొని, ఆపైన అప్లై చేయండి. అవసరం లేని అప్లికేషన్లను దూరంగా పెట్టండి. మీరు లోన్ అప్లై చేసే ముందు స్కోర్ ఎంత ఉందో తెలుసుకోండి. స్కోర్ తక్కువ ఉంటే అప్పుడే అప్లై చేయకండి.
ఎందుకు ఈ అవగాహన అవసరం?
క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ హెల్త్‌కి ఒక అద్దం లాంటి విషయం. మీపై బ్యాంక్‌లు ఎలా నమ్ముతాయో ఈ స్కోర్ ఆధారంగా జరుగుతుంది. ఒక సారి స్కోర్ తగ్గితే, తిరిగి పెరగడానికి నెలల గడువు పడుతుంది. అందుకే… స్కోర్‌ను ప్రభావితం చేసే ఈ ‘ఇంక్వయిరీల’ గురించి ముందే తెలుసుకోడం చాలా అవసరం.
అంతే కాదు – మీరు స్కోర్ చెక్ చేస్తే కింద పడుతుంది అనుకున్నవారికి ఇది షాకింగ్ నిజం. ఇప్పుడు నుంచే తెలివిగా మెలగండి – లేకపోతే ఒక్క తప్పు మీ లోన్‌ను ఖతం చేస్తుంది