ఆస్తులు, స్థలాలు మరియు వస్తువుల వేలం గురించి సాధారణంగా అందరికీ తెలుసు. అయితే ఎక్కడైనా రూ.10 నోట్లు వేలం వేయడం చూశారా? కనీసం విన్నారా ? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రూ.10 నోట్లు లక్షలు పలుకుతున్నాయి. రెండు రూ.10 నోట్లు కలిపి దాదాపు రూ. 2.7 లక్షలు. కళ్లు చెదిరే ధరలు పలుకుతున్న ఈ కరెన్సీ నోట్ల కథ ఏంటో తెలుసుకుందామా !
రెండు భారతీయ రూ.10 నోట్లు ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి. అయితే ఇవి మామూలు నోట్లు కావు. నివేదికల ప్రకారం, బొంబాయి నుండి లండన్‌కు వెళ్లే మార్గంలో ఈ రెండిటిని ఓడ శిధిలాల నుండి స్వాధీనం చేసుకున్నారు. జూలై 2, 1918న జర్మన్ యు -బోట్ లో ఈ ఓడ మునిగిపోయింది.
ఈ శిథిలాల మధ్య ఒడ్డున రూ.5, రూ.10, రూ.1 నోట్లు భారీగా తేలాయి. అనంతరం ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఈ నోట్లు మళ్లీ ఉనికిలోకి వచ్చాయి. వీటిని లండన్‌లో వేలం వేయనున్నారు.
లండన్‌లోని నూన్ మేఫెయిర్ వేలంలో కేంద్రం ఈ రెండు నోట్లను వేలం వేయనుంది. ఈ నోట్ల ధర అక్షరాలా 2,000 నుండి 2,600 పౌండ్ల విలువ అనగా రూ.2.7 లక్షల వరకు ఉంటుంది. ఈ నోట్లు గట్టిగా కట్టివేయబడినందున కొన్ని నోట్లు చాలా మంచి స్థితిలో ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది.