ఈ‌‌ ఒక్క కార్డు తో అన్ని OTTలు ఫ్రీ.. ఇష్టమైన ప్రోగ్రాం ఇప్పుడే చూసేయండి…

ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చూడడం కామన్ అయింది. సినిమా థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా, మనం ఇంట్లోనే వాలిపోయి కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసేస్తున్నాం. కానీ వీటి సబ్‌స్క్రిప్షన్లు నెలకు రూ.150 నుంచి రూ.500 వరకూ ఉండటంతో నెలవారీ ఖర్చు బాగా పెరుగుతోంది. అలాంటప్పుడు మీకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం వస్తే బాగుండదా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మధ్య కాలంలో కొన్ని క్రెడిట్ కార్డులు ఖాతాదారులకు SonyLiv, Zee5, Amazon Prime, Times Prime లాంటి పాపులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డు తీసిన తర్వాత కొన్ని ఖర్చులు చేసినపుడే ఇవి అందుతాయి. అయితే కొన్ని కార్డులు ఫస్ట్ పర్చేజ్ నుంచే గిఫ్ట్ ఇస్తున్నాయి.

క్రెడిట్ కార్డుతో వచ్చే అదనపు ప్రయోజనాలు

సాధారణంగా క్రెడిట్ కార్డులు 45 రోజుల వరకు ఇన్టరెస్ట్ ఫ్రీగా కొనుగోళ్లకు అవకాశం ఇస్తాయి. అంతేకాకుండా, కొన్ని కార్డులు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు, ఎయిర్‌మైల్ బెనిఫిట్స్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా వచ్చాయి.

Related News

క్రింద చెప్పిన 5 కార్డులు మీకు ఈ సూపర్ ఆఫర్ ఇస్తున్నాయి. ఈ అవకాశం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా “ఇప్పుడు కచ్చితంగా కార్డు తీసుకోవాల్సిందే” అనుకుంటారు

Axis Bank My Zone క్రెడిట్ కార్డ్

ఈ కార్డుతో మీరు కార్డు తెచ్చిన తర్వాత 30 రోజుల్లోనే కనీసం ఒక కొనుగోలు చేస్తే, మీకు సంవత్సరానికి విలువైన ₹1,499 ఉన్న SonyLiv Premium సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. అలాగే District app ద్వారా బుక్ చేసే రెండవ సినిమా టికెట్‌కు 100% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. అంటే ఓటీటీ చూసేందుకు కూడా, సినిమాకెళ్లేందుకు కూడా డబ్బు మిగులుతుంది.

HDFC Diners Club Privilege క్రెడిట్ కార్డ్

ఈ కార్డు కొత్తగా తీసుకునే వారికీ ఒక వెల్‌కమ్ గిఫ్ట్‌గా Times Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తుంది. Times Prime అంటే ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో చాలా బ్రాండ్స్ పై డిస్కౌంట్లు వస్తాయి – Zomato, SonyLiv, TOI+, Zee5 లాంటి పాపులర్ సర్వీసులపై బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం ఈ గిఫ్ట్ వల్లే చాలామంది ఈ కార్డు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

HDFC Diners Club Black క్రెడిట్ కార్డ్

ఇది HDFC బ్యాంక్ ఇచ్చే మరో ప్రత్యేక కార్డు. ఈ కార్డుతో మీకు రెండు పెద్ద ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి – Amazon Prime మరియు Times Prime. ఈ రెండు కలిపి చూస్తే ఏడాది ఖర్చు దాదాపు ₹1,500 పైగానే ఉంటుంది. ఇది కూడా ఒక వెల్‌కమ్ గిఫ్ట్ రూపంలో వస్తుంది. రోజూ ఓటీటీ చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఆఫర్.

IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డు కూడా ఒక ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. మీరు వర్చువల్ క్రెడిట్ కార్డు జనరేట్ చేసిన తర్వాత మొదటి 60 రోజులలో ₹500 పైగా చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కి ₹500 క్యాష్‌బ్యాక్ వస్తుంది – అదీ నాలుగు సార్లు వరకూ. అంటే మొత్తం ₹2,000 వరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని మీరు Amazon Prime, Zee5, Hotstar వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లకు ఉపయోగించవచ్చు. మీ డబ్బుతోనే మీకు ఓటీటీ ఉచితంగా వస్తోంది అన్నమాట.

AU బ్యాంక్ LIT క్రెడిట్ కార్డ్

ఇది ఓ ఆసక్తికరమైన కార్డు. మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత మొదటి 90 రోజుల్లో ₹5,000 ఖర్చు చేస్తే Zee5 సబ్‌స్క్రిప్షన్, ₹10,000 ఖర్చు చేస్తే Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం వస్తుంది. కానీ మీరు ఈ లక్ష్యాన్ని పూర్తీ చేయలేకపోతే, బ్యాంక్ సైట్ ప్రకారం ₹50 నుంచి ₹299 వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఖర్చు ప్లాన్ చేసుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

మొత్తంగా చూసుకుంటే

ఈ 5 క్రెడిట్ కార్డులు ఓటీటీ ప్రేమికులకు ఒక బంపర్ ఆఫర్ లా మారాయి. ఇప్పుడు మనం నెలకు కనీసం రెండు మూడు ఓటీటీ యాప్‌లను వాడుతూనే ఉంటాం. వాటికి ప్రతి నెలా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒక్కసారి క్రెడిట్ కార్డు తీసి సరైన షాపింగ్ చేస్తే సబ్‌స్క్రిప్షన్లు ఉచితం వస్తున్నాయి. మీరు ఇప్పటికే ఓటీటీ ఖర్చు చేస్తుంటే, ఈ ఆఫర్లతో మీరు ఏడాదికి ₹3,000 – ₹5,000 వరకూ సేవ్ చేయొచ్చు.

ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ కార్డుల్ని మీరు బ్యాంకు సైట్‌లో చూడండి. మీ అవసరానికి తగినదాన్ని ఎంచుకుని అప్లై చేయండి. ఒక్కసారి కార్డు వచ్చాక, ఓటీటీ ప్లాన్‌లు మీద ఖర్చు పడనవసరం లేదు.