ఇది Digital యుగం. కొత్త Cyber నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా వారి మాయలో పడతారు. రూ. వేల, లక్షల Money పోతుంది.
ఒకప్పుడు సైబర్ నేరాలు అంటే PIN నంబర్ తెలుసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం, OTP ద్వారా డబ్బులు దొంగిలించటం, Part Time Job ఆఫర్లు వంటివి జరిగేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు కొత్త మోసాలు సృష్టిస్తున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది “Digital Arrest”. ఈ విధంగా నిరక్షరాస్యులనే కాకుండా విద్యావంతులను సైతం వేధిస్తున్నారు. మరి.. ఈ Digital Arrest ఏంటి? ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం.
తాజాగా గత నెల 23 న హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధురాలుకు ముంబై పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ దంపతులకు సంబంధించిన మనీలాండరింగ్ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, FIR కూడా నమోదు చేశామని బెదిరించాడు. మిమ్మల్ని ‘డిజిటల్‌గా అరెస్ట్ చేస్తా’ అని బెదిరించి, బాధితురాలి బ్యాంకు ఖాతా, FDలు, PPF ఖాతాల నుంచి రూ.5.9 కోట్లు బదిలీ చేయించారు. ఇలాంటి సంఘటనలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి. పోలీసులకు భయపడి లొంగిపోతున్నారు.
అసలు ఇది ఎలా జరుగుతుంది..
గుర్తు తెలియని వ్యక్తి పోలీసు అధికారి వేషంలో స్కైప్ లేదా వాట్సాప్‌లో వీడియో కాల్ చేస్తాడు. తనను తాను CBI లేదా ED అధికారిగా పరిచయం చేసుకుంటాడు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, మీపై FIR నమోదు చేశామని వాట్సాప్‌లో కాపీ పంపుతాడు. బాధితురాలి బ్యాంక్ అకౌంట్ నంబర్, అందులో నగదు జమ అయినట్లు ఆధారాలు ఉండడంతో షాక్ కు గురయ్యాడు.
దేశ భద్రతకు సంబంధించిన తీవ్ర నేరమని, బెయిల్ రాదని, నెలల తరబడి జైల్లో ఉండాల్సి వస్తుందని అవతలి వ్యక్తి తనను అరెస్ట్ చేస్తామని బెదిరించడంతో బాధితుడు వణికిపోయాడు. ముంబయి క్రైం బ్రాంచ్‌కు ఫోన్ కాల్‌ని బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మరొక వ్యక్తి వీడియో కాల్‌లో చేరాడు. సైబర్ క్రైమ్ ఎస్పీ లేదా ఉన్నతాధికారిగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ‘మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం’ అని, విచారణకు సహకరించాలని, నేరంతో సంబంధం లేదని తేలితే కేసు నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. విచారణ పూర్తయ్యే వరకు వీడియో కాల్ ఆఫ్ చేయకూడదని, మరెవరితోనూ మాట్లాడకూడదని, మలవిసర్జనకు వెళ్లినా తలుపులు తెరిచి ఉంచాలని షరతులు విధిస్తున్నాడు.
చివరకు ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. లేకుంటే జీవితాంతం జైల్లోనే గడపాలని బెదిరించారు. ఇదంతా విన్న బాధితులు ఏం చేయాలో తోచలేదు. ముందుగా ఆ సమస్య నుంచి బయటపడాలనే కోరికతో వారు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఒకరిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా స్క్రీన్ ముందు నిర్బంధించి దోచుకోవడాన్ని ‘డిజిటల్ అరెస్ట్’ అంటుంటారు నిపుణులు. కాగా, తాజాగా దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ తరహా నేరాలు ఎక్కువయ్యాయని చెప్పారు. తెలంగాణలో ఈ డిజిటల్ అరెస్టులు పెరగడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే ధైర్యంగా 1930కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.