డైరీమిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదు: TS స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు chocolates ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇటీవల chocolates తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పలు కంపెనీలకు చెందిన chocolates మార్కెట్ లో దొరుకుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ Cadbury Dairymilk chocolates వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని Ameerpet metro station లో ఓ వ్యక్తి Cadbury chocolates ను కొనుగోలు చేశాడు. రాపర్ దానిని తెరిచి తినడానికి ప్రయత్నించినప్పుడు, అతనికి సజీవ పురుగు కనిపించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

దీంతో సదరు వ్యక్తి GHMC కి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. Cadbury Dairy Milk chocolates ను తినడంపై తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల కీలక నిర్ణయం తీసుకుంది. Cadbury Dairy Milk chocolates ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించింది. dairy milk chocolates. లకు దూరంగా ఉండాలని Cadbury ప్రజలకు సూచించింది.

అయితే అన్ని రకాల Cadbury chocolates లు కాకుండా Roast Almond, Fruit and Nut chocolates లు మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ లేబొరేటరీ స్పష్టం చేసింది. అమీర్పేట మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ chocolates లో పురుగులు ఉన్న శాంపిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్లో పరిశీలించిన అధికారులు అందులో తెల్ల పురుగులు ఉన్నట్లు గుర్తించారు. Food Safety Standards Act 2006 ప్రకారం, Cadbury’s Roasted Almond, Fruit and Nut chocolates లు సురక్షితం కాదని నిర్ధారించారు.

Cadbury Dairy Milk chocolates లు తినడం సురక్షితం కాదని తెలంగాణ State Food Laboratory నిర్ధారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *