ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వస్తారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారు. అదే రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం తన బావమరిది దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరిగి నేరుగా ఢిల్లీకి వెళతారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. 7వ తేదీ అమరావతికి తిరిగి వస్తారు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో ప్రారంభమవుతుంది.
CM chandrababu: మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పడంటే..?

05
Mar