తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిధిలోని జూనియర్ డివిజన్లో 150 మంది సివిల్ జడ్జీల భర్తీకి Hyderabad లోని తెలంగాణ Telangana High Court notification విడుదల చేసింది. ఈ notification direct recruitment ద్వారా ప్రాతిపదికన 31 ఖాళీలు మరియు 2024 సంవత్సరానికి బదిలీల ద్వారా 15 ఖాళీలు; 2024 మరియు 2025 సంవత్సరాలకు, 90 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన (భవిష్యత్తు/ఊహించబడినవి) మరియు 14 ఖాళీలను బదిలీల ద్వారా (భవిష్యత్తు/ఊహించినవి) భర్తీ చేస్తారు. elangana Judicial Rules and Regulations ప్రకారం, నిర్ణీత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు May 17వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.
Vacancies Details:
1. Civil Judge (Junior Division)- Direct Recruitment (for the year 2024): 31 Posts
2. Civil Judge (Junior Division)- Replacement by transfer (for the year 2024): 15 posts
3. Civil Judge (Junior Division)- Direct Recruitment (Future/ Anticipated) (for the years 2024, 2025): 90 Posts
4. Civil Judge (Junior Division)- Replacement by Transfer (Future/ Anticipated) (for the years 2024, 2025): 14 Posts
Total Number of Posts: 150.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో Bachelors Degree . మూడేళ్లపాటు అడ్వకేట్ లేదా ప్లీడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ నిర్దేశించిన విద్యార్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు కనీసం 23 సంవత్సరాల నుండి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
జీతం అలవెన్సులు: నెలకు 77,840 నుండి 1,36,520.
ఎంపిక ప్రక్రియ: Screening Test (Computer Based Test), Written Test, Viva-Voice Test మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.1000 (SC,ST,EWS అభ్యర్థులకు రూ.500).
Screening Test Exam Centers: Hyderabad, Warangal, Karimnagar, Khammam. .
ముఖ్యమైన తేదీలు:
Online దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2024.
Screening Test Hall Ticket Download : 08-06-2024.
Date of Screening Test (Computer Based Test ): 16-06-2024.