ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు

21
Mar