DSLR camera mobiles: క్వాలిటీ ఫోటోలు తీయాలా?… DSLR కే పోటీగా నిలిచే స్మార్ట్‌ఫోన్లు…

2025కి వచ్చేసరికి స్మార్ట్‌ఫోన్ కెమెరాల టెక్నాలజీ ఒక కొత్త స్థాయికి చేరింది. ఇప్పుడు డీఎస్‌ఎల్‌ఆర్‌ లెవల్‌ ఫోటోలు దిగేందుకు మొబైల్ ఫోన్‌ చాలిపోతుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయినా, అద్భుతమైన క్వాలిటీ ఫోటోలు తీసుకోవాలనుకునే సాధారణ యూజర్ అయినా.. ఈ ఏడాది విడుదలైన టాప్ ఫైవ్ ఫోన్లు మీ కోరికను తీర్చగలవు. వీటిలోని కెమెరా, సెన్సార్‌, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు DSLR లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వివో X100 ప్రో మోడల్‌ జైస్‌ లెన్స్‌ భాగస్వామ్యంతో వచ్చింది. 50 ఎంపీ మైన్, అల్ట్రా వైడ్‌, టెలిఫోటో లెన్సులతో అదిరిపోయే డిటైల్‌, కలర్ అక్యురసీ అందిస్తుంది. ఇందులో ఉన్న కెమెరా సాఫ్ట్‌వేర్ శబ్దాన్ని తగ్గించడంతో పాటు డైనమిక్ రేంజ్‌ను మెరుగుపరుస్తుంది. 8K వీడియోలతోపాటు బ్రైట్ AMOLED డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీతో ఇది ఫొటో లవర్స్‌కి పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.

వన్‌ప్లస్ 13 కూడా మంచి డీఎస్‌ఎల్‌ఆర్‌ ఫీలింగ్‌ ఇచ్చే కెమెరా ఫీచర్లతో వచ్చింది. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్‌అప్, స్మార్ట్ AI మోడ్యూల్స్‌తో కూడిన ఫోటో టూల్స్‌తో బహుళ ఎలివేషన్స్‌లో ఫోటోలు తీసుకోవచ్చు. 4K వీడియోతో పాటు 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే దీన్ని ఒక వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి.

Related News

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ కు వచ్చిన కొత్త Tensor G4 చిప్ కెమెరా పనితీరును నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. మేజిక్ ఎడిటర్‌, నైట్ సైట్‌, సూపర్ రెజ్ జూమ్ వంటి ఫీచర్లు దీన్ని computational photography లో ఓ బెంచ్‌మార్క్‌గా నిలిపాయి. 50MP మైన్ కెమెరాతోపాటు 5x ఆప్టికల్ జూమ్ కలిగిన టెలిఫోటో కెమెరా ఉంది. దీని ద్వారా ప్రొఫెషనల్ లెవెల్‌ ఫోటోలు తీయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో కూడా టాప్ ఫైవ్‌లో ఉంది. 48MP ప్రధాన కెమెరాతో కలర్ అక్యురసీ, డైనమిక్ రేంజ్, సిమటిక్ వీడియోలు చాలా స్టబిల్‌గా వస్తాయి. Dolby Vision HDR, 5x టెలిఫోటో జూమ్ లెన్స్‌, అల్ట్రా వైడ్ లెన్స్ దీన్ని మరింత ప్రొఫెషనల్ టచ్ ఇస్తుంది. ప్రీమియం డిజైన్‌, iOS ఎక్స్పీరియన్స్ దీన్ని ఐఫోన్ లవర్స్‌కి బెస్ట్ ఛాయిస్‌గా నిలిపింది.

సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మాత్రం DSLR క్వాలిటీ ఫోన్‌లో నంబర్ వన్. దీని 200MP ప్రధాన కెమెరా అన్నింటికంటే శార్ప్‌, క్లియర్‌, డిటైల్డ్ ఫోటోలు అందిస్తుంది. AI పవర్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌, 8K వీడియో, అల్ట్రా వైడ్‌ నుంచి అల్ట్రా టెలిఫోటో వరకు అన్నీ ఒకే ఫోన్‌లో దొరుకుతాయి. భారీ డిస్‌ప్లే, ఎస్ పెన్ సపోర్ట్, మెరుగైన బ్యాటరీ లైఫ్ దీన్ని క్రియేటర్స్‌కు స్పెషల్ ఫోన్‌గా నిలబెట్టాయి.

ఈ ఫోన్లు అంతంత ధరకు దొరకడం కూడా విశేషం. కానీ ఒక్కో మోడల్‌కు సంబంధించిన ఫీచర్లు, ధరలు, మార్కెట్‌లో లభ్యత ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. ఒకసారి కొనాలనుకున్న ముందు ఆఫీషియల్ వెబ్‌సైట్లు చెక్ చేయడం మంచిది. అయితే, ఫొటో క్వాలిటీ విషయంలో ఇది DSLR కు సమానమైన మొబైల్ ఫోన్‌ల పోటీనే!