భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు విడాకులకు సిద్ధమవుతున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు. చాహల్ తన అకౌంట్ నుంచి భార్య ఫోటోలను డిలీట్ చేశాడు.
దీంతో వీరిద్దరూ కచ్చితంగా విడిపోతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ, అతనితో ఉన్న ఫోటోలను ధనశ్రీ తొలగించలేదు. “వారు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుంది. అయితే, వారి విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు” అని సన్నిహితులు తెలిపారు.
Related News
కాగా, చాహల్ ముంబైకి చెందిన డెంటిస్ట్ మరియు కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో కలిసి డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవాడు. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో చేసిన పోస్ట్‌లతో అభిమానులను తికమక పెట్టారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం చాహల్ స్పందిస్తూ తాము విడిపోవడం లేదని చెప్పాడు. అయితే తాజాగా ఆయన భార్య ఫొటోలను తొలగించడం మరోసారి వారి విడాకుల గురించి తీవ్ర చర్చకు దారితీసింది.