Tirumala : తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖుల సందడి!!

శుక్రవారం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి జానా రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ దయానంద్, జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవలలో పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హీరోయిన్ హన్సిక మోత్వానీ, ఆమె భర్త కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో హన్సిక స్వామి సేవలో పాల్గొని పూజలు చేశారు. దర్శనం అనంతరం జానా రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల నుంచి విరామం తీసుకున్నానని అన్నారు.. ఇప్పుడు కూడా మీరందరూ నన్ను గుర్తుంచుకుని ఆరాధిస్తున్నారు.. తిరుమలలో నా పాత స్నేహితులను కలవడం నాకు సంతోషంగా ఉంది. ఈరోజు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

పరిపాలన పరంగా మాత్రమే తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించారని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తన అనుభవాన్ని అందిస్తానని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మధ్య బంధాలను రాష్ట్రాల సరిహద్దులు విచ్ఛిన్నం చేయలేవని ఆయన అన్నారు.

Related News