రోజురోజుకి నిద్రలేమి సమస్య చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రమాదకరంగా మారుతోంది. నిద్రలేమికి అనేక సమస్యలు ఉండొచ్చు. అయితే, పడుకునే ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండటం, చదవడం, తేలికపాటి వ్యాయామం చేయడం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేస్తే నిద్రలోకి జారుకుంటాము. ఇది మీకు చాలా వరకు సహాయపడుతుంది. ఇకపొతే రాత్రిపూట ప్రశాంతంగా ఎలా నిద్ర పోవాలో ఇక్కడ చూద్దాం.
1. ప్రతి ఒక్కరు రోజంతా ఒక దినచర్యను ఏర్పరచుకోవాలి. అంటే.. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని మేల్కొనాలి. అలాంటి టైమింగ్స్ పెట్టుకోవాలి. ప్రతి పని చేయడానికి సరైన సమయాన్ని పాటించాలి.
2. పడుకునే ముందు గంటల్లో ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటి బ్లూ-లైట్ స్క్రీన్‌లను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంది. అదే సమయంలో అది దినచర్యను పాడు చేయవచ్చు.
Related News
3. రాత్రిపూట ఎక్కువ భోజనం తినడం మానుకోవాలి. దీనికి బదులు రొట్టెలు తినొచ్చు. నిద్రపోయే ముందు మద్యం, కెఫిన్, పొగాకు తినడం మానుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం.
4. పడుకునే ముందు విశ్రాంతి తీసుకోవాలి. నిద్ర పోయే ముందు పుస్తకం చదవడం లేదా సంగీతం వినడం చేయాలి.
5. మీ పడకగదిని సౌకర్యవంతంగా ఉందొ లేదో చేసుకోండి. హాయిగా నిద్ర పోవడానికి గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేటట్లు చూసుకోండి.
6. ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. దీంతో హాయిగా నిద్ర పడుతుంది.
7. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు, గింజలు, పండ్లు, కూరగాయలు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహార పదార్థాలను తినండి. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఇంటర్నెట్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సమాచారం మీకు అందించబడింది. ఇందులోని విషయాలు అవగాహన కోసం మాత్రమే.