Business Idea: ఇంట్లో నుంచే నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న మహిళ.. అదిరే బిజినెస్!

తమిళనాడుకు చెందిన దీప, రవి కుమార్ దంపతులు నిజామాబాద్ జిల్లా ఒక చిన్న పరిశ్రమను స్థాపించి లక్షల్లో సంపాదిస్తున్నారు. మహిళా సంఘం నుండి రుణం తీసుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కష్టపడి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఒక మహిళ నిరూపించింది. రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి, తోటి మహిళలను ఒప్పించి, మహిళా సంఘం నుండి రుణం తీసుకుంది. తరువాత, ఆమె చిన్న కుటీర పరిశ్రమలను స్థాపించి లక్షలు సంపాదిస్తోంది. తమిళనాడుకు చెందిన దీప, రవి కుమార్ దంపతులు గత 30 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో నివసిస్తున్నారు. వారు ఒక చిన్న కుటీర పరిశ్రమను స్థాపించి జీవనోపాధి పొందుతున్నారు. వారు మురుక్కు, బొంగు, తెల్ల మురుక్కు, పుట్నాలు, కార, బొండి వంటి వివిధ చిన్న ఆహార పదార్థాలను తయారు చేసి కిరాణా దుకాణాల్లో అమ్మి చిన్న కుటీర పరిశ్రమను నిర్వహిస్తున్నారు.

అవసరమైన యంత్రాలు, ప్యాకింగ్ యంత్రాలు మరియు పిండి మిక్సింగ్ యంత్రాల కోసం రుణాలు తీసుకొని అప్రతిహతంగా అభివృద్ధి చెందారు. మొదట్లో మహిళా గ్రూపులో తనను చేర్చడానికి సభ్యులు నిరాకరించారని దీప చెప్పారు. డ్వాక్రా గ్రూపులో చేరిన తర్వాత, 2003లో పది వేల రుణం తీసుకున్నాను. ప్రతి నెలా తాను దానిని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని వివరించింది. నేడు, తాను 10 లక్షల రుణం తీసుకున్నానని, మిషనరీలను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నానని ఆమె చెప్పింది. వారు మూడు నెలల పాటు తయారుచేసే ఆహార పదార్థాలకు గ్యారెంటీ ఇస్తున్నారు.

Related News

చుట్టుపక్కల గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు ఆహార పదార్థాలను తీసుకెళ్లి డెలివరీ చేయడానికి మేము వ్యాన్ తీసుకున్నాము,” అని ఆమె చెప్పారు. ఖర్చులు అన్నీ పోను ప్రతి నెలా 80 వేల నుండి లక్ష రూపాయల ఆదాయం సంపాదిస్తున్నానని ఆమె చెప్పారు. శ్రీనిధి మరియు డ్వాక్రా గ్రూపులు మాకు పది లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి మా అభివృద్ధికి మద్దతు ఇచ్చాయి” అని రవి కుమార్ చెప్పారు.