బంపర్ ఆఫర్ ఫ్రీగా 42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఇచ్చేస్తున్నారోచ్..

ప్రభుత్వం పిలిచి మరీ ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. ఎగిరి గంతేసి మరీ దానిని దక్కించుకోడానికి క్యూలు కడతారు కదా. కానీ జర్మనీలో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం..కావాలనుకున్నవారు తీసుకోవచ్చంటూ జర్మన్‌ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్‌ ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అవును మరి పెద్ద పెద్ద భవనాలను కట్టేయగానే సరిపోతుందా.. వాటిని మెయింటెయిన్‌ చెయ్యాలిగా.. అదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతో ఆ విల్లాను ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దామని డిసైడ్‌ అయింది.

జర్మన్‌ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్‌ ఒకరు.

ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తా పత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈయనదే. 1936లో దానిని నిర్మించారు.

గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదిలించుకోవాలని చూస్తోంది.

ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది అని ఆ దేశ ఆర్థిక మంత్రి స్టెఫాన్‌ ఎవర్స్‌ వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు.

ప్రస్తుతం అది రోజురోజుకూ శిధిలావస్థకు చేరుతోంది. దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే.. ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.