బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివితే గుండె దడదడలాడిపోతుంది. ఈ సంవత్సరం జరగబోయే విపత్తుల గురించి తెలుసుకుంటే వెన్ను చలిల్లుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో భయంకర భూకంపాలు వస్తాయని చెప్పినట్లే, ఇటీవల బ్యాంకాక్, మయన్మార్లలో సంభవించిన భూకంపాలు దీనికి నిదర్శనంగా నిలిచాయి.
ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచం కన్నీరు కార్చింది. ఇక ముందు మరింత ఘోరమైన సంఘటనలు జరగనున్నాయని, ప్రకృతి విలయ తాండవం మానవాళికి పెద్ద సవాలుగా మారనుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
Related News
తెలుగు రాష్ట్రాలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తన కాలజ్ఞానంలో వివరించిన బ్రహ్మంగారిని తెలుగు ప్రజలు గొప్పగా నమ్ముతారు.
ఆయన రచనలను ఆధారంగా చేసుకుని అనేక ఆడియోలు, వీడియోలు, సినిమాలు కూడా రూపొందించబడ్డాయి. 80లు, 90ల దశకంలో ప్రతి ఇంటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆడియో క్యాసెట్ల రూపంలో వినిపించేవి. సినిమా పాటల కంటే ఈ భవిష్యత్ వాణులే ప్రజలను ఎక్కువగా ఆకర్షించేవి. ఆయన చెప్పినదంతా నిజమవడమే ఈ క్రేజ్కు కారణం.
ఇప్పుడు, బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో 2025 సంవత్సరం గురించి ఏమి చెప్పారు? ఈ సంవత్సరం ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, ఆర్థిక అస్తవ్యస్తతలతో ప్రపంచం గందరగోళంలో పడనుందని పండితులు వివరిస్తున్నారు.
- ప్రకృతి విపత్తులు:భూకంపాలు, వరదలు, తుఫానులు మరింత తీవ్రమవుతాయి. సముద్రాలు ముందుకు సాగి తీర ప్రాంతాలను ముంచెత్తనున్నాయి. సముద్రం నుండి వింత జంతువులు బయటకు వచ్చినప్పుడు, అది ప్రళయానికి సూచనగా భావించాలని బ్రహ్మంగారు హెచ్చరించారు.
- కొత్త రోగాలు:చైనా దిక్కు నుండి ఒక కొత్త మహమ్మారి వ్యాపిస్తుందని, మందులేని పరిస్థితిలో అనేక మంది ప్రాణాలు కోల్పోవచ్చని కాలజ్ఞానంలో ఉంది.
- ఆర్థిక సంక్షోభం:యుద్ధాల వల్ల బంగారం, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని తాకనుంది. ఆకలి, దుర్భిక్షం ప్రపంచాన్ని బాధిస్తుంది.
- తిరుపతి విశేషాలు:తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క కుడి భుజం కదలికలు మొదలవుతాయని, కొన్ని ఆలయాలలో అద్భుత శబ్దాలు వినిపిస్తాయని చెప్పబడింది.
- కృష్ణా-గోదావరి వరదలు:ఈ నదుల్లో భారీ వరదలు వస్తాయి. కృష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం కనిపించి, దాని తేజస్సు చూసిన వారి కళ్ళు పోవచ్చని హెచ్చరించారు.
ఇంకా, సౌర తుఫానులు, సమాచార వ్యవస్థలు కుప్పకూలడం వంటి అంశాలు కూడా బ్రహ్మంగారి భవిష్యవాణిలో ఉన్నాయి. కాబట్టి, ఈ సంవత్సరం మానవాళి ఎదుర్కొనబోయే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు.