Bigg Boss Telugu 8: బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ షో బిగ్ బాస్. Telugu Bigg Boss 2017లో ప్రారంభమై ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే 8వ సీజన్‌కు రంగం సిద్ధమవుతుంది.ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయిందని వినికిడి. సినిమా, సీరియల్ నటీనటులు, సోషల్ మీడియా స్టార్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను బిగ్ బాస్ టీమ్ సంప్రదించింది.
అనుకున్న సమయం కంటే ముందుగానేseason 8 ప్రారంభం కానుందని సమాచారం. season 8 లాంచింగ్ ఎపిసోడ్ ఆగస్ట్ 4 లేదా 11న ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే Bigg Boss 8కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఆ లిస్టులో ఎవరూ ఊహించని పేరు వినిపిస్తోంది.
గత season లాగానే ఈసారి కూడా దాదాపు 19, 20 మంది సెలబ్రిటీలను పంపనున్నారు.. వారిలో నటీమణులు హేమ, బర్రెలక్క, కిరాక్ ఆర్పీ, సురేఖా వాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కుమారి ఆంటీ, యూట్యూబర్ బుంచిక్ బబ్లూ, సోనియా సింగ్, నేత్ర అనే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు అప్పట్లో పరువు హత్య కేసులో వార్తల్లో నిలిచిన అమృత ప్రణయ్ కూడా హౌస్‌లోకి అడుగుపెడుతుందని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.
అలాగే వేణు స్వామి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలు పబ్లిక్‌గా చెప్పి పాపులర్ అయ్యాడు వేణు స్వామి. టాప్ హీరోయిన్లు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేణు స్వామికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. పూర్తి క్లారిటీ రావాలంటే లాంచ్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. season 8కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు.