సినీ నటుడు, మాజీ వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళికి పెద్ద ఊరట లభించింది. నరసరావుపేటలో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పలువురు టీడీపీ నాయకులు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసానిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, బెంచ్ ఆయనకు రిమాండ్ విధించింది. అయితే, ఈ కేసులో బెయిల్ కోరుతూ పల్నాడు జిల్లా కోర్టులో పోసాని తరపున పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు నటుడు పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా.. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
POSANI MURALI: పోసానికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..!!

11
Mar