బెంగళూరు రేవ్ పార్టీ.. ప్రధాన సూత్రధారి ఇతనే.. నిందితుల ఫోన్లలో విస్తుపోయే నిజాలు..!

బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెంగళూరు శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లోనూ సంచలనంగా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పట్టుబడ్డారని బెంగళూరు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో పట్టుబడిన సెలబ్రిటీలు ఎవరనేది ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు.

అతనే సూత్రధారి

Related News

ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఐదుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి విజయవాడకు చెందిన లంకపల్లి వాసు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఆంజనేయవాగు కొత్తపేటకు చెందిన వాసుకు విజయవాడలోనూ పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించారు.

బెట్టింగ్, డ్రగ్స్.. చీకటి పనులు చేసేవాడు లంకపల్లి వాసు

లంకపల్లికి చెందిన ఇతడు పలు చీకటి కార్యకలాపాలు చేస్తున్నాడని, వివిధ వ్యాపారాలు, ఫార్మా ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు బెట్టింగ్‌లకు పాల్పడి పెద్ద నెట్‌వర్క్ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది.

నిందితుల ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు

అంతేకాదు నిందితుల మొబైల్ ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉన్నట్లు సమాచారం. వీరికి ఏపీ పోలీసులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఈ రేవ్ పార్టీలో అరెస్టయిన 101 మందిలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఐదుగురు మినహా.. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానిపై పరీక్షలు నిర్వహించారు. వారందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అవసరమైనప్పుడు పోలీసులు విచారణకు పిలుస్తారని సమాచారం.

రేవ్ పార్టీ కేసుపై లోతైన విచారణ

ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్న సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌భావ్‌లను డ్రగ్స్‌ వ్యాపారులుగా గుర్తించిన పోలీసులు వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ, సీరియల్ నటీనటులు, 20 మందికి పైగా మోడల్స్, 30 మంది యువతులు, 70 మంది యువకులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.