July 5న భారతదేశంలో Bajaj CNG Bike విడుదల: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లోని ప్రముఖ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాలను పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో విడుదల చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలా మంది టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. అధిక మైలేజీతో తక్కువ ధరకు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రముఖ కంపెనీలు కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.
ఇందులో భాగంగా మైలేజీ పరంగానే కాకుండా భద్రత పరంగా కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా చాలా సందర్భాలలో విఫలమవుతున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్‌కి మంటలు అంటుకుని అక్కడికక్కడే కాలిపోవడం ఇప్పటి వరకు చాలానే చూశాం. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ Bajaj Petrol electric vehicles స్థానంలో CNG ద్విచక్ర వాహనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
Related News
ఇందులో భాగంగానే ఈ CNG Bike పై దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఈ బైక్‌కు సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. ఈ CNG Bike ఎలా ఉంటుందోనని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా CNG Version లో ద్విచక్ర వాహనాలను విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు బజాజ్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు మరికొద్ది రోజుల్లో ఈ బైక్ ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు లాంచ్ డేట్‌ను కంపెనీ తాజాగా వెల్లడించింది. జూలై 5న భారత్‌లో ఈ బైక్‌ను విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.దీనిలో భాగంగా లాంచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
దీని కోసం, వినియోగదారులు వారి పేరు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్‌ను అందించాలి. ఇది వారి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుంది. కావున ఎప్పటి నుంచో ఈ CNG బైక్ కోసం ఎదురుచూస్తున్న వాహన ప్రియులు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ బైక్ సిఎన్‌జితో మాత్రమే కాకుండా పెట్రోల్‌తో కూడా నడుస్తుందని కంపెనీ తెలిపింది. సిఎన్‌జి అయిపోయినప్పుడు పెట్రోల్‌తో నడపవచ్చని పేర్కొంది. మీరు పెట్రోల్ అయిపోతే, మీరు CNG తో నడపవచ్చు.
ఈ బైక్ పేరును కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, తాజా సమాచారం ప్రకారం, ఈ బైక్‌ను ప్రస్తుతం ‘Bajaj Bruiser CNG ‘ అని పిలుస్తున్నారు. ఈ బైక్ ప్రతి కిలో CNG కి 100 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే దీని ధరను మాత్రం వెల్లడించలేదు. కానీ అంచనా ధర ప్రకారం ఈ సీఎన్ జీ బైక్ రూ.లక్ష లోపు ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.