దేశంలో CNG, PNG వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగానికి సంబంధించిన నేచురల్ గ్యాస్ ధరలను పెంచింది. దీనివల్ల కుకింగ్ గ్యాస్ ఖర్చు పెరుగుతుంది, CNG వాహనాల నిర్వహణ ఖరీదవుతుంది, ఫర్టిలైజర్ కంపెనీలపై ప్రభావం పడుతుంది.
CNG, PNG ధరలు ఎలా మారాయి?
గృహ నేచురల్ గ్యాస్ ధర 25 సెంట్లు పెరిగి, $6.75 కు చేరింది. మార్చిలో ఇది $6.50 మాత్రమే ఉండేది. ఇది గడచిన రెండు సంవత్సరాల్లో జరిగిన తొలి పెంపు. 2023లో ప్రభుత్వం గ్యాస్ ధరలకు $6.50 కాప్ పెట్టింది కానీ, మూడో ఏడాది నుంచి ప్రతిసంవత్సరం 25 సెంట్ల పెంపు ఉండేలా నిబంధన తీసుకొచ్చింది.
ఈ పెంపు ఎవరిని ప్రభావితం చేస్తుంది?
పిల్లలైనా, పెద్దలైనా – కిచెన్ ఖర్చు పెరిగిపోతుంది. PNG ద్వారా వంట చేసేవారికి గ్యాస్ బిల్లు పెరిగిపోతుంది. ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది మధ్య తరగతి కుటుంబాలపై భారంగా మారనుంది. CNG వాహనదారులకు కష్టాలు పెరుగుతాయి. CNG వాహనాల రన్నింగ్ ఖర్చు పెరుగుతుంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది.
కంపెనీలు, రైతులు కూడా
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఖర్చులను వినియోగదారులపై వేయవచ్చు. ఫర్టిలైజర్ తయారీదారుల ఖర్చు పెరిగి, ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పంటల ఖర్చు పెరిగి, రైతులకు తలనొప్పిగా మారవచ్చు.
గ్యాస్ రేట్లు మళ్లీ పెరుగుతాయా?
ప్రస్తుతం నిర్ణయించిన రేట్లు 6 నెలల పాటు అమలులో ఉంటాయి. 5 అక్టోబర్ 2025 తర్వాత మళ్లీ రివ్యూ చేసి కొత్త ధరలు నిర్ణయించనున్నారు. కాబట్టి, మరిన్ని పెంపులు జరిగే ప్రమాదం కూడా ఉంది.
CNG వాడే వాళ్లూ, PNG వినియోగించే వాళ్లూ – మీ ఖర్చులు ఇంకోసారి ఆలోచించండి.