Baahubali: క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న రాజమౌళి .

ఇప్పటికీ బాహుబలి 1 మరియు 2 సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా ప్రత్యేకమైనవి. అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆ రేంజ్ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ బాహుబలి వస్తుంది. రీరిలీజ్ అవుతుందా అంటే అదీ కాదు.. ఈసారి బాహుబలి యానిమేషన్ రానుంది. ఈ పేరుతో యానిమేషన్ సిరీస్‌ను తీసుకువస్తున్నారు. ఎస్! ఈ సిరీస్‌కి బాహుబలి.. ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ వస్తుందని ట్వీట్ చేశాడు. “మాహిష్మతి ప్రజలు అతని పేరును జపిస్తూ ఉంటే, ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని తిరిగి రాకుండా ఆపదు. యానిమేషన్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రాబోతోంది” అని జక్కన్న తన ట్వీట్‌లో రాశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే, ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలు ఏవీ ప్రకటించబడలేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, యానిమేషన్ సిరీస్‌ని థియేటర్లలో విడుదల చేస్తారా? లేదా OTTలో ప్రసారం చేస్తున్నారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.