Speaker Ayyannapatrudu: ఏపీ స్పీకర్‌ గా అయ్యన్నపాత్రుడు!

Ayyannapatrudu : మంత్రివర్గంలో చోటు దక్కని చింతకాయల అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనను AP ASSEMBLY SPEAKER గా  నియమించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అలాగే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, లోకం మాధవి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది.

జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో దూళిపాళ్ల నరేంద్ర పేరు చీప్ వైఫ్ గా పరిశీలనలో ఉంది. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.