కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో పాటు అర్జున అవార్డును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇందులో భాగంగా ఇద్దరు అథ్లెట్లను ఎంపిక చేశారు. వీరిలో అథ్లెటిక్స్ విభాగానికి చెందిన యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జీవంజీ దీప్తి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.
పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో జివాన్‌జీ దీప్తి కాంస్య పతకం సాధించింది. కాగా, ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడా అవార్డులను ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.