ఇప్పుడు, ఎందుకు ఆర్థిక ప్రణాళిక అవసరం? దీని గురించి తెలుసుకుందాం.
ఎమర్జెన్సీల్లో డబ్బుల సమస్య – అప్పుల బారిన పడే అవకాశం
జీవితం అనిశ్చితతలతో నిండి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం లేదా ఆకస్మిక ఖర్చులు ఏ సమయంలోనైనా రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా పొదుపు చేసుకోకపోతే, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది లేదా ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది.
దీన్ని నివారించాలంటే, కనీసం 6-12 నెలల ఖర్చును కవర్ చేసే “ఎమర్జెన్సీ ఫండ్” సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ నిధిని సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ఉత్తమం. అవసరమైనప్పుడు తక్షణమే తీసుకునేలా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
“ముందుగా ఆదా చేయడం, తర్వాత ఖర్చు చేయడం” అనే నియమాన్ని పాటిస్తే, ఆర్థిక సంక్షోభాల్లో కూడా ఆత్మనిర్బంధంగా ఉండగలుగుతారు.
రిటైర్మెంట్ ప్లానింగ్ ఆలస్యం అంటే కోట్లు పోయినట్లే
చాలామంది “రిటైర్మెంట్ గురించి తర్వాత ఆలోచించుదాం” అనుకుంటూ, పొదుపు చేయడం ఆలస్యం చేస్తుంటారు. కానీ, సమయానికి మొదలు పెట్టకపోతే, భవిష్యత్తులో చాలా కష్టంగా మారుతుంది.
ఉదాహరణకి, మీరు 25 సంవత్సరాల వయసులో ప్రతి నెలా ₹10,000 పెట్టుబడి పెడితే, 12% వార్షిక రాబడి వచ్చినట్లు అనుకుంటే, 60 ఏళ్ళకు ₹10 కోట్లు పైగా సంపాదించవచ్చు.
కానీ, 40 సంవత్సరాల వయసులో మొదలు పెడితే, అదే ₹10 కోట్లు సంపాదించడానికి ప్రతి నెల ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి.
ఈ తేడా చూసిన తర్వాత, “ఇప్పుడే పొదుపు మొదలు పెట్టాలి” అనే ప్రాముఖ్యత అర్థమవుతుంది.
Related News
ఇంకెందుకు ఆలస్యం? మీ భవిష్యత్ సురక్షితం చేసుకోండి
ఆర్థిక ప్రణాళిక లేకుండా జీవితం నడిపితే చివరికి కష్టాలు తప్పవు. ఇప్పుడే నిర్ణయం తీసుకొని, పొదుపును మొదలు పెట్టండి.
నేడు మీరు చేసే చిన్న పెట్టుబడి, రేపటి మీ భద్రతకు పెద్ద ఆస్తిగా మారుతుంది.