ఈ మధ్య రోజుల్లో విద్యుత్ బిల్లుల పేరుతో భయపెడుతూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం గమనిస్తున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఈ విషయంపై ఒక కీలక హెచ్చరిక ఇచ్చారు. కొంతమంది మోసగాళ్లు విద్యుత్ వినియోగదారులకు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి మీ కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉంది, వెంటనే చెల్లించకపోతే రాత్రిపూట కరెంట్ కట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
ముషారఫ్ ఫరూఖీ ప్రకారం, వారు వినియోగదారులను ఒక మొబైల్ నంబర్‌కి ఫోన్ చేయమని చెబుతూ, అక్కడ అకౌంట్ వివరాలు అడుగుతున్నారని. అలాంటి సందేశాలు నమ్మితే మన డబ్బు మాయం అవుతుంది. వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం చేసే ప్రమాదం ఉందని TGSPDCL పేర్కొంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఈ మోసపు కాల్స్ వల్ల నష్టపోయారని తెలిసిందట.
అసలు TGSPDCL ఫ్రాడ్ మెసేజ్‌లు పంపించదని స్పష్టంగా తెలిపారు. విద్యుత్ సంస్థ నుంచి వచ్చే అసలైన మెసేజ్‌ల్లో వినియోగదారుని పేరు, యూఎస్సీ నంబర్, సర్వీస్ నంబర్, బిల్లు మొత్తం స్పష్టంగా ఉంటాయి. ఎప్పుడూ TGSPDCL మొబైల్ నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపదు. అధికారిక సమాచారం మాత్రమే సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా వస్తుంది.
మరొక కీలకమైన విషయం ఏమిటంటే, TGSPDCL ఉద్యోగులు ఎప్పుడూ వినియోగదారుల బ్యాంక్ డీటెయిల్స్ అడగరని, వాళ్లు కేవలం చెల్లింపు రసీదులు మాత్రమే ఇస్తారని ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైనా బ్యాంక్ ఖాతా నంబర్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు అడిగితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిని నిరాకరించండి.
మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, TGSPDCL ఎప్పుడూ ఎస్.ఎం.ఎస్ ద్వారా వెబ్‌సైట్ లింక్‌లు పంపదు. మీ బిల్లు వివరాలను తెలుసుకోవాలంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.tgsouthernpower.org లేదా టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ఉపయోగించండి. అక్కడే మీరు మీ ప్రస్తుత బిల్లు వివరాలు, పెండింగ్ మొత్తాలను సురక్షితంగా తెలుసుకోవచ్చు.
ఇంకా TGSPDCL మరో స్పష్టత ఇచ్చింది. వారు ఎప్పుడూ రాత్రిపూట లేదా అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయరని చెప్పారు. ఇది మోసగాళ్లు భయపెడుతూ చేస్తున్న పనిమని తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఎటువంటి డౌట్ వచ్చినా నేరుగా TGSPDCL అధికారిక ఛానళ్లను సంప్రదించమని సూచించారు.
ఈ మధ్యకాలంలో ఈ తరహా మోసపూరిత సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది దీనికి బలైపోతున్నారు. ఒకవేళ మీరు అలాంటి మెసేజ్‌లు అందుకున్నా, వెంటనే అప్రమత్తమవ్వండి. అసలు వారి చెప్పిన మొబైల్ నంబర్స్‌కి ఫోన్ చేయొద్దు. ఏదైనా డౌట్ వస్తే, నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లోని కస్టమర్ కేర్ నంబర్‌కే ఫోన్ చేయండి.
ఈ మోసగాళ్లు కేవలం మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తోనే కాదు, కొన్ని ఫేక్ వెబ్‌సైట్లు సృష్టించి కూడా డబ్బులు దోచుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి లింక్‌లను నొక్కకుండా, నేరుగా వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ టైప్ చేసి ఓపెన్ చేయండి. అనుమానాస్పదమైన ఎస్‌ఎమ్‌ఎస్ లింక్స్‌లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకండి.
మొత్తానికి, విద్యుత్ వినియోగదారులు అలర్ట్‌గా ఉండాలి. అలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు వచ్చిన ప్రతిసారీ నమ్మకండి. సరైన సమాచారం తెలుసుకోవాలంటే TGSPDCL అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ వాడండి. ఏ సందేహమైనా వారి కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. మీ డబ్బును, మీ డేటాను కాపాడుకోండి.
మొత్తం వ్యవహారాన్ని TGSPDCL తీవ్రంగా గమనించింది. వినియోగదారులు మోసపోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.