APPSC Recruitment: లక్ష పైనే జీతంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల భర్తీకి డిసెంబర్ 28 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

దీని ద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి APPSC జనవరి 30న ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 20 వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడతాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 47

Related News

సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:

  • ఇంగ్లిష్-09,
  • తెలుగు-02,
  • ఉర్దూ-02,
  • సంస్కృతం-02,
  • ఒడియా-01,
  • గణితం-01,
  • ఫిజిక్స్-05,
  • కెమిస్ట్రీ-03,
  • బోటనీ-02,
  • జువాలజీ-01,
  • ఎకనామిక్స్-12,
  • సివిక్స్-02,
  • హిస్టరీ- 05.
  • Eligibility : సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Age limit: 28.12.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు మరియు తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ల పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో..

పార్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి) – 150 ప్రశ్నలు – 150 మార్కులు – 150 నిమిషాలు.

పేపర్-2: అభ్యర్థి సబ్జెక్ట్ (పీజీ స్థాయి) – 150 ప్రశ్నలు – 300 మార్కులు – వ్యవధి 150 నిమిషాలు.

పేపర్-1లోని ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు, పేపర్-2లోని ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ మార్కు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్:

మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ యూసేజ్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా కనీస అర్హత మార్కులు నిర్ణయించారు.

Mode of Apply: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Salary details: నెలకు రూ.57,100 నుండి రూ.1,47,760.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31.01.2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.02.2024.

Written Tesat: ఏప్రిల్/మే 2024.

వెబ్‌సైట్: https://psc.ap.gov.in/

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *