AP Rain Alert: మధ్యప్రదేశ్ కోస్తా ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, Cyclone విస్తరిస్తున్నదని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాద్ వెల్లడించారు.
దీని ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరికొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని వారు తెలిపారు.
అత్యవసర సహాయం కోసం అధికారులు టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించారు.
Related News
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో రేపు జిల్లాలు మరికొన్ని చోట్ల అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ విభాగం ఎండీ తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.