AP News: ఏపీలో రూ.100 కోట్ల పెట్టుబడులు, ప్రముఖ సంస్థ సిద్ధం

TG Bharat on Investments: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మంగళవారం (జూలై 2) మంగళగిరిలోని APIIC headquarters  Minister TG Bharat  తో Vermeerian Company  ప్రతినిధులు సమావేశమయ్యారు. శ్రీసిటీలోని Vermeerian Company  unit ను విస్తరించేందుకు మంత్రితో చర్చలు జరిపారు.

సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు Vermeerian Company  సిద్ధంగా ఉందన్నారు. Vermeerian Company  ఆసుపత్రి పరికరాల తయారీకి ప్రసిద్ధి చెందింది. త్వరలోనే శ్రీసిటీలో సంస్థను విస్తరించేందుకు పనులు ప్రారంభిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడిదారులు తరలి వస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రియాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Ambassador of Belgium in India who met Chandrababu
Belgium కు చెందిన పలువురు వాణిజ్య ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. భారత్‌లోని బెల్జియం రాయబారి వాండర్ హాసెల్ట్ నేతృత్వంలో వీరంతా సీఎంను కలిశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణం ఏపీలో ఉందని చంద్రబాబు వారికి వివరించారు.