ఏపీని మరో తుఫాను వణికిస్తోంది. తాజాగా ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
ఇది అల్పపీడనంగా క్రమంగా బలపడుతుంది. ఈ నెల 13 నుంచి 15 మధ్య తుపానుగా రూపాంతరం చెంది ఈ నెల 17 నాటికి ఏపీకి సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
భారీ వర్షాలు
Related News
అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారుతుందని అంచనా. ఈ నెల 15, 16 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక స్పష్టమవుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులో రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ కోస్తా ప్రాంతంతో పాటు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాలపై ప్రభావం
ప్రధానంగా ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17 నాటికి ఏపీ తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. .
IMD అంచనా
తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదిలి రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం మీదుగా వ్యవస్థగా మారుతుందని పేర్కొంది.