ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో Bollywood Bold Actress, బీజేపీ నాయకురాలు కంగనా రౌనత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి MP గా గెలుపొందారు. చందాగఢ్ విమానాశ్రయంలో CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనా చెంప చెళ్లు మని కొట్టింది. . దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అయితే కుల్విందర్ కౌర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, గతంలో సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనాపై దాడి జరిగిందని కుల్వీందర్ కౌర్ వెల్లడించారు.
ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతుంది. ఇందులో కొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇటీవల గాయకుడు విశాల్ దద్లానీ CISF కానిస్టేబుల్‌కు మద్దతుగా నిలిచారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే.. నేను మంచి వుద్యోగం కల్పిస్తా అన్నారు . నేను హింసను సమర్ధించను కానీ.. మహిళా కానిస్టేబుల్ ఆగ్రహం ఏంటో అర్థమైంది. ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకున్నా, ఉద్యోగం పోయినా.. ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జై హింద్.. జై జవాన్.. జై కిసాన్ అని రాశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, కుల్వీందర్ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. దర్నా, రాస్తారోకులు చేస్తూ రైతుల కష్టాలపై స్వేచ్ఛగా మాట్లాడిన కంగనాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనాతో ఆమెకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని అంటున్నారు. ఈ ఘటనపై సరైన విచారణ జరిపించాలని పంజాబ్ డీజీపీని కలిసి అభ్యర్థిస్తామని రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ సుందర్, జగదీత్ సింగ్ దల్లెవాల్ మీడియాకు తెలిపారు. ఈ డిమాండ్ తో ఆదివారం మొహాలీలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లనున్నట్లు వెల్లడించారు.