
స్వీట్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేవి — పాలు, నెయ్యి, చక్కెర. కానీ ఇవేవీ లేకుండా కూడా ఒక మంచి, ఆరోగ్యకరమైన, నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతున్నంత మృదువైన హల్వా తయారు చేయొచ్చని మీకు తెలుసా? ఇది తక్కువ పదార్థాలతో, ఇంట్లో లభించే వస్తువులతో, చాలా తక్కువ టైమ్లో రెడీ అవుతుంది. ముఖ్యంగా ఇది ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు తప్పక ట్రై చేయాల్సిన హోమ్మేడ్ హెల్తీ స్వీట్.
ఈ హల్వాలో గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం వంటి సహజ పదార్థాలు మాత్రమే వాడుతారు. దీనిలో పాలు కూడా రెండు రకాలుగా వస్తాయి — ఒకటి గోధుమ పాలు, మరొకటి కొబ్బరి పాలు. కొబ్బరి పాలు చాలా మందికి తెలుసు కానీ, గోధుమ పాలు ఎలా తయారుచేయాలో అనేది స్పష్టత ఉండదు.
తయారీ చాలా ఈజీ. ముందుగా గోధుమ పిండి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ మాదిరిగా కలిపి, దాన్ని గంటసేపు నానబెట్టాలి. తర్వాత దానిలో నీళ్లు పోసి చేతితో బాగా కడిగితే పాలు వేరు అవుతాయి. ఆ పాలను వడగట్టి పక్కన పెట్టాలి. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రెండు రకాల పాలలతో హల్వా చేయవచ్చు.
[news_related_post]ఇక బెల్లాన్ని తీసుకుని నీళ్లలో కరిగించి చిన్న మంటపై వేయాలి. ఒకసారి నురుగు వస్తే, అందులో గోధుమ పాలు వేసి మిశ్రమం జెల్లీలా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ తరువాత కొబ్బరి పాలు కలిపి నిరంతరం కలుపుతూ వండాలి. ఇంతలో మిశ్రమం చిక్కగా మారుతుంది. అప్పుడే యాలకుల పొడి, జీడిపప్పు వేసి బాగా కలపాలి. కొబ్బరి నుంచి నూనె బయటకి వచ్చినప్పుడే మీ స్వీట్ రెడీ అయ్యిందని అర్థం.
ఈ హల్వా తినగానే నోరూరుతుంది. ఏ రకం చక్కెర, పాలు లేకుండా ఇంత రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటం నిజంగా ప్రత్యేకత. ఇలాంటిది మిస్ అవ్వడం అంటే రుచి మరియు ఆరోగ్యం రెండింటినీ మిస్ అవుతున్నట్టే! వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో వారందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వండి!