
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. ప్రతీ నెల ప్లాన్ ఎంచుకోవడమే పెద్ద సవాలుగా మారింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్లాన్లు ఒక్కసారిగా పెరిగిపోయిన తర్వాత, చాలామంది వినియోగదారులు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీళ్లందరికీ బీఎస్ఎన్ఎల్ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. జియో, ఎయిర్టెల్ కంపెనీలకు నిజంగానే ధమ్కీగా మారేలా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఇప్పుడు మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే, ఇది మీకో బంపర్ ఛాన్స్. ఎందుకంటే ఈ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని మీరు నెలరోజుల డేటా అవసరాన్ని చాలా తక్కువ ధరలో తీర్చుకోవచ్చు. ఈ కొత్త ఆఫర్ వినగానే ఎవరికైనా “ఏమిటీ ఇంత తక్కువకా?” అనే ఆశ్చర్యం కలుగకమానదు.
బీఎస్ఎన్ఎల్ కంపెనీ తాజా ప్లాష్ సేల్ ద్వారా ఈ ప్లాన్‌ను అందిస్తోంది. అసలు విషయమేంటంటే, ఈ ప్లాన్‌లో మీరు కేవలం రూ.400 ఖర్చు చేస్తే, మొత్తం 400GB 4G హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఇది అక్షరాలా ఒక్క రూపాయికే 1GB డేటా లెక్క.
[news_related_post]ఈ డేటాను మీరు 40 రోజులపాటు వాడుకోవచ్చు. అంటే రోజుకి 10GB వరకు ఉపయోగించుకోవచ్చన్న మాట. చాలా మంది స్టూడెంట్లు, యూట్యూబ్ చూసేవాళ్లు, ఆన్లైన్ క్లాసులు తీసుకునేవాళ్లు, బీజీగా డేటా వాడే వాళ్లకు ఇది ఒక గోల్డ్న ఛాన్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆఫర్ మొదట 2025 జూన్ 28 నుంచి జూలై 1 వరకు మాత్రమే ఉండాల్సింది. కానీ వినియోగదారుల అద్భుత స్పందనను చూసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ కంపెనీ ఈ సేల్ గడువును పొడిగించింది. ఇప్పుడు ఈ ప్లాన్ July 7, 2025 వరకు లభ్యం అవుతుంది.
అంటే మీకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. ఆఫర్ మిస్ అయితే పక్కన వాళ్లు సులభంగా రోజుకి 10GB డేటాతో ఎంజాయ్ చేస్తుంటే, మీరు మళ్లీ ఖరీదైన ప్లాన్ కోసం తలపడాల్సి ఉంటుంది. ఆలోచించకుండానే వెంటనే రీచార్జ్ చేయడం మంచిది.
ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ స్వయంగా సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ (Twitter) లో ఒక పోస్ట్ చేసింది. “Too Good to End – BSNL 400GB for ₹400 Plan Now Extended! Recharge now & enjoy massive data for 40 days. Valid till 7th July!” అంటూ ప్రకటించింది.
ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలామంది వెంటనే రీచార్జ్ చేసేశారు. మరి మీరు ఇంకా చేయలేదా? అప్పుడే వెళ్లి మీ BSNL నంబరుతో రీచార్జ్ చేసేయండి. ప్లాన్ లింక్: https://bsnl.co.in/mobile/recharge
ఈ ఆఫర్లో 4G స్పీడ్‌తో డేటా లభిస్తుండటం స్పెషల్. చాలామంది అనుకుంటుంటారు ప్రభుత్వ కంపెనీ ప్లాన్లు తక్కువైతే స్పీడ్ కూడా తక్కువగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ ఆ తప్పుదానిని మార్చేసింది. ఇప్పుడు 4G టెక్నాలజీతో స్పీడ్ కూడా సమర్థంగా అందుతోంది.
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, జియో, ఎయిర్టెల్ వంటివి ఇలాంటి ధరకు కనీసం 40GB కూడా ఇవ్వవు. కానీ బీఎస్ఎన్ఎల్ ఏకంగా 400GB ఇవ్వడమే కాదు, ధరను కూడా కేవలం రూ.400గా పెట్టింది. ఇది డేటా వాడే ప్రతి ఒక్కరికీ లాభమే.
ఇంత తక్కువ ధరలో ఇంత పెద్ద డేటా ఆఫర్ ఎప్పుడైనా చూశారా? ఇది మళ్లీ వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. అందుకే జూలై 7లోపే రీచార్జ్ చేసేయండి. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్‌కి మిస్ అవ్వకండి.
ఇంత డేటాతో మీరు ఫ్రీగా యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆన్లైన్ క్లాసులు, జాబ్ అప్లికేషన్లు అన్నీ సులభంగా చేసుకోవచ్చు. అది కూడా కేవలం రూ.400తో…