
దేశంలోని చిన్న పెట్టుబడిదారులు, మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలు ఇలా అందరికీ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రజల పొదుపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జూలై నుంచి సెప్టెంబర్ 2025 వరకూ ఈ పథకాలపై ఇచ్చే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే గత త్రైమాసికానికి ఉన్న వడ్డీ రేట్లే ఇప్పుడు కూడా అమల్లో ఉండబోతున్నాయి.
ఈ చిన్న పొదుపు పథకాలు చిన్నమొత్తంతో ప్రారంభించవచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ, జాతీయ పొదుపు పత్రం (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ వంటి పథకాలు ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా నిలుస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే స్థిరమైన వడ్డీ, పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఫైనాన్స్ మినిస్ట్రీ జూన్ 30, 2025న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జూలై నుంచి సెప్టెంబర్ 2025 మధ్య ఎలాంటి వడ్డీ మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంటే మీ పెట్టుబడి పథకాలపై ఇప్పటివరకూ ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయి.
[news_related_post]సుకన్య సమృద్ధి యోజన (SSY): 8.2% వడ్డీ. అమ్మాయిల చదువు, పెళ్లికి సేవింగ్స్ చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్. కేవలం ₹250తో ఖాతా ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం ₹250 డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా ₹1.5 లక్షల వరకూ పెట్టుబడి చేయొచ్చు. 21 ఏళ్లలో maturity.
పబ్లిక్ ప్రవిడెంట్ ఫండ్ (PPF): 7.1% వార్షిక వడ్డీ. దీర్ఘకాలిక పొదుపు కోసం ఇది మంచి ఎంపిక. 15 ఏళ్ల కాలపరిమితి ఉంది. కనీసం ₹500తో స్టార్ట్ చేయవచ్చు. గరిష్ఠంగా ₹1.5 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. దీనిపై సెక్షన్ 80Cలో పన్ను మినహాయింపు లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5% వడ్డీతో 115 నెలల్లో డబ్బు డబుల్ అవుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత గల పథకం.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): 8.2% వడ్డీతో సీనియర్ సిటిజన్లకు ఇది చాలా మంచిది. 5 ఏళ్ల maturity ఉంటుంది. గరిష్ఠంగా ₹30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. త్రైమాసిక వడ్డీ లభిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.5% వడ్డీ రేటు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్. ఇది రెండు సంవత్సరాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా ₹2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.
జాతీయ పొదుపు పత్రం (NSC): 7.7% వడ్డీ. ఇది మధ్యకాలిక పెట్టుబడిదారులకు సరైనది. 5 ఏళ్ల maturity. సెక్షన్ 80Cలో పన్ను మినహాయింపు లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ FD: వడ్డీ రేట్లు 6.9% నుంచి 7.5% వరకూ ఉన్నాయి. 1 నుంచి 5 ఏళ్ల టెర్మ్ FDలు అందుబాటులో ఉన్నాయి.
పీపీఎఫ్ అనేది మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగ విరమణను దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఇది రిస్క్-ఫ్రీ పొదుపు పథకం కావడంతో పాటు, ఆదాయపన్ను మినహాయింపుతో కూడుకున్నది. 15 ఏళ్ల తర్వాత పెన్షన్ లక్ష్యంగా మంచి మోస్తరు మొత్తాన్ని పొందవచ్చు.
చిన్న పెట్టుబడిదారులు, రిస్క్ తక్కువ పెట్టుబడులు కోరేవారు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు – వీరందరికీ ఇవి మరింత ఉపయోగపడతాయి. పన్ను మినహాయింపులు కావాలనుకునే వారికి, భవిష్యత్‌కు క్రమబద్ధమైన సేవింగ్స్ చేయాలనుకునే వారికి ఇవి బెస్ట్ స్కీమ్స్.
ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ స్థాయి, రిజర్వ్ బ్యాంక్ విధానాలు – ఇవన్నీ పరిశీలించి ప్రభుత్వం వడ్డీ రేట్లు మార్చలేదు. ఇది పెట్టుబడిదారులకు స్పష్టతను ఇస్తుంది. రిస్క్ తక్కువ పెట్టుబడి కోరే వారికి ఇది మంచి నిర్ణయం.
మీరు మీ భవిష్యత్‌ను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఈ చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి ప్రారంభించండి. నెలకు ₹250తో మొదలుపెట్టవచ్చు. చివరికి లక్షల్లో డబ్బు రాబట్టవచ్చు. ఇప్పుడే డిపాజిట్ చేసి, టెన్షన్లేని టుమారోను పొందండి.