School holidays: విద్యార్థులకు శుభవార్త… ఈ వారం శుక్రవారం స్కూల్‌కు సెలవు?…

వేసవి సెలవులు ముగిశాక పిల్లలందరూ మళ్లీ పాఠశాలలకు హాజరవుతున్నారు. రోజూ ఉదయం లేచి స్కూల్‌కు వెళ్లడం, హోం వర్క్‌లు చేయడం ప్రారంభమైంది. సెలవుల తర్వాత మళ్లీ చదువులో అడ్జస్ట్ అవుతుండగానే… ఇప్పుడు అకస్మాత్తుగా శుక్రవారం అంటే జూన్ 20న సెలవు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పిల్లలకే కాదు – కొన్ని ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులకు కూడా శుభవార్తగా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు జూన్ 20న బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేసే అవకాశం ఉంది. అంటే గురువారం వరకు క్లాసులు, ఆపై శుక్రవారం సెలవు, తర్వాత శనివారం, ఆదివారం – మొత్తం మూడు రోజుల విడత సెలవులు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట!

ఈ బంద్ నిర్ణయం వెనుక గల కారణాలేంటి అంటే, ఇటీవల కేంద్ర భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో కొన్ని కీలక మావోయిస్టు నాయకులు చనిపోవడం, మరికొందరు అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనిపై నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, వాణిజ్య సంస్థలు ఈ బంద్‌కు ఎలా స్పందిస్తాయో అన్నది వేచి చూడాలి.

Related Posts

ఇది చిన్న బంద్ అనుకోకండి. వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభావం ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు ముందస్తుగా మూసివేసే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వొచ్చు.

ఇలా చూసుకుంటే… ఈ వారంలో మూడు రోజుల సెలవు వచ్చే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ప్లాన్‌కి సిద్ధంగా లేరంటే ఇప్పుడు జాగ్రత్తపడండి. ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నా, ఈ సెలవు దొరికితే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

ఇక మీ స్కూల్‌కు లేదా ఆఫీస్‌కు సెలవా లేదా అన్నది మాత్రం లోకల్ నోటిఫికేషన్ ఆధారంగానే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం, జూన్ 20న చాలామందికి హాలిడే ఫీలింగ్ దాదాపు గ్యారెంటీగానే ఉంది!