Healthy breakfast: ఇలా ఓట్స్‌తో టిఫిన్ చేశారంటే.. అదే రోజు నుంచి బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది…

ఈ రోజుల్లో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌ను డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. అయితే ప్రతి రోజు అదే బోరింగ్ ఓట్స్ తినడం ఎవరికైనా చికాకు కలిగించే విషయమే. అందుకే ఈసారి మీ కోసం ఓ ప్రత్యేకమైన, తక్కువ సమయంలో తయారయ్యే, ఆరోగ్యకరమైన టిఫిన్‌ను తీసుకొచ్చాం. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అదే “టమాటా మసాలా ఓట్స్”.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇది ఒక పర్ఫెక్ట్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్. ఇది రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, ఉప్మా లాంటి టిఫిన్స్‌కి చాలా మంచి ఆల్టర్నేటివ్. ఇవి తక్కువ సమయంలో తయారవుతాయి. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నేహితుడిలా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో తక్కువ కాలరీలతో ఎక్కువ సమయం నిండుగా ఉంటారు.

ఇవి తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా ఓట్స్‌ను తక్కువ మంట మీద కొద్దిగా వేయించాలి. ఒక పాన్‌లో నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇప్పుడు క్యారెట్ తురుము, బఠాణీలు, టమాటాలు వేసి బాగా కలపాలి. వాటిలో పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఉప్పు వేసి నీళ్లు తగినంతగా పోసి మరగనివ్వాలి.

Related Posts

నీళ్లలో టమాటా మిశ్రమం బాగా ఉడికిన తరువాత, ముందు వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసి కలపాలి. ఆ మిశ్రమం జారుగా అయ్యేవరకు వండాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. రెండు నిమిషాలు ఉంచి తరువాత సర్వ్ చేయాలి. చల్లారాక ఇది కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఉడికించేటప్పుడు నీళ్ల మోతాదు కాస్త ఎక్కువగా వేయాలి.

ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మసాలా ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీయదు. పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బఠాణీలు వంటి కూరగాయలతో పోషకాలన్నీ అందుతాయి. పిల్లలు కూడా ఇది బాగుందని ఇంకోసారి అడుగుతారు.

ఇలా మీరు ఓట్స్‌తో కొత్త రుచిని అనుభవించండి. ఇదొకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించేలా ఉంటుంది. సాధారణ టిఫిన్లు బోరింగ్ అనిపించినప్పుడు, ఈ టమాటా మసాలా ఓట్స్ మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది, రోజుకి కొత్త తినుబండారాన్ని కూడా ఇస్తుంది.

ఇప్పుడు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే మిస్ అవుతున్నారన్నమాట! ఎందుకంటే ఇది ఒకే టైంలో టేస్టీ, హెల్దీ, ఈజీ టిఫిన్. ఇప్పుడు ట్రై చేయండి, కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తుంది!