Tecno Phantom V Fold: ఇంత చీప్‌గా ఫోల్డబుల్ ఫోన్ వస్తుందా?.. ధర చూస్తే నమ్మలేరు…

ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలో పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ పోటీలో భాగంగా టెక్నో కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Android 14తో డైరెక్ట్‌గా బాక్స్ నుండి లాంచ్ అయిన ఈ ఫోన్‌లో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. కానీ నిజంగా ఇది వాడే వారికీ ఎలాంటి అనుభూతి ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డిజైన్ & డిస్ప్లే: స్లిమ్‌గా ఉన్నా మజా గల ఫోన్

Tecno Phantom V Fold 2 చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు దీని మందం కేవలం 6.1 మిల్లీమీటర్లు మాత్రమే. ఫోన్ వెయిట్ 249 గ్రాములే అయినా, చాలా ఫీల్ వస్తుంది. దీన్ని కొంతసేపు ఒకే చేతిలో పట్టుకున్నప్పుడు తక్కువగా తలపించదు. 7.85 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.

దీని రిఫ్రెష్ రేట్ 120Hz కావడంతో స్క్రోల్లింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 2000×2296 పిక్సెల్ రెజల్యూషన్‌తో స్క్రీన్ కలర్స్ చాలా బ్రైట్‌గా, క్లారిటీతో కనిపిస్తాయి. పిక్సెల్ డెన్సిటీ 388ppi ఉండటంతో, పోటీ ఫోన్లతో పోల్చితే కాస్త తక్కువ అనిపించొచ్చు. కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు.

Related News

బిల్డ్ క్వాలిటీ: టాబ్లెట్ అనుభవాన్ని ఫోన్‌లో

ఈ ఫోన్ బాడీ క్వాలిటీ చాలా సాలిడ్‌గా ఉంటుంది. Corning Gorilla Glass Victus Plus‌తో గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్‌ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉండటంతో మొబైల్ మోడ్, టాబ్లెట్ మోడ్‌కు మారడం చాలా సులభం.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా రెండు డిస్‌ప్లేల్లో ఉంటుంది. కానీ ఈ ఫోన్‌కు వాటర్ ప్రూఫ్ IP రేటింగ్ ఉండదు. కనుక నీటిలో వాడకూడదు.

కెమెరా: పేపర్ మీద భలే ఉంది కానీ పనితీరు సగటు

Tecno Phantom V Fold 2 కెమెరా సెటప్ పేపర్ మీద చాలా హైగా ఉంటుంది. మూడు 50MP కెమెరాలతో రేర్ సెటప్ ఉంటుంది. ఓఐఎస్ సపోర్ట్ ఉండటంతో ఫోటోలు స్టేడీగా వస్తాయి. కానీ యాక్చువల్ పెర్ఫార్మెన్స్‌లో ఇది పర్వాలేదనిపిస్తుంది. డే లైట్‌లో ఫోటోలు ఓకే అయినా, లో లైట్‌లో క్లారిటీ తక్కువగా ఉంటుంది.

వీడియో రికార్డింగ్ 4K@30fps వరకు చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 32MP ఉంటుంది. సెల్ఫీలు చాలా క్లీన్‌గా వస్తాయి. కానీ ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోలిస్తే రాత్రి టైమ్‌లో ఫలితాలు తగ్గుతాయి.

పెర్ఫార్మెన్స్ & స్టోరేజ్: ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్పీడ్

Dimensity 9000 Plus ప్రాసెసర్‌తో టెక్నో ఈ ఫోన్‌ని పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దింది. 3.2GHz స్పీడ్‌తో కూడిన ఈ ప్రాసెసర్ మొల్టీటాస్కింగ్, గేమింగ్, హైవోల్యూమ్ యాప్‌లను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీని RAM 12GB కాగా, అదనంగా 12GB వరకూ వర్చువల్ RAM సపోర్ట్ ఉంది.

స్టోరేజ్ విషయానికి వస్తే 512GB వరకు ఇంటర్నల్ మెమరీ ఉంది. కానీ మెమోరీ కార్డ్ పెట్టుకునే స్లాట్ లేదు. ఇది కొంతమందికి మైనస్ అయ్యే అవకాశం ఉంది.

బ్యాటరీ & ఛార్జింగ్: నిత్యం నిలిచే బ్యాటరీ లైఫ్

Tecno Phantom V Fold 2లో 5750mAh బ్యాటరీ ఉంది. ఇది ఫోల్డబుల్ ఫోన్‌కి చాలా పెద్ద కెపాసిటీ. thin డిజైన్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం ఆశ్చర్యం కలిగించగలదు. ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 70W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మోస్తరుగా వాడితే రోజంతా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు.

ఫైనల్ వెర్డిక్ట్: ఖరీదు తక్కువ, ఫీచర్లు పుష్కలంగా

Tecno Phantom V Fold 2 డిజైన్ పరంగా, ఫెర్ఫార్మెన్స్ పరంగా ఒక మంచి ఫోల్డబుల్ ఫోన్ అనిపిస్తుంది. కెమెరా విషయంలో టాప్‌ గేర్ ఇవ్వకపోయినా, బ్యాటరీ, డిస్‌ప్లే, స్పీడ్ వంటి ముఖ్యమైన అంశాల్లో ఇది గట్టిగా నిలబడుతుంది.

రూ. 1.25 లక్షల పైగా ఖర్చు చేయలేని ఫోల్డబుల్ ఫోన్ లవర్స్ కోసం ఇది సరైన ఆప్షన్. మీరు కూడా ఫోల్డబుల్ ఫోన్‌కు మారాలనుకుంటున్నారా? అయితే Tecno Phantom V Fold 2ను ఓసారి ఫీల చేసి చూడండి. ఈ ధరకు ఇలాంటి ఫోన్ ఇంకొకటి లేదు..