FISHERMEN: ఏపీ మత్స్యకారులకు ఆ రోజు అకౌంట్లో రూ.20000 జమ!

ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వం గొప్ప శుభవార్తను అందించింది. ఏపీ మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో ₹20,000 ఇవ్వాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు కీలక ప్రకటన చేశారు. మత్స్యకార నిషేధ సమయంలో ఏపీ మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని… ₹10,000 నుండి ₹20,000 కు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 

ఈ నెల 26న మత్స్యకారుల ఖాతాల్లో ₹20,000 జమ అవుతుందని వివరించారు. ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల చేతుల మీదుగా ఈ సహాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శిస్తారని కూడా వివరించారు. షెడ్యూల్ త్వరలో ఖరారు అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Related News

61 రోజుల పాటు చేపల వేట నిషేధం

ఏపీలో చేపల పునరుత్పత్తిని, తల్లి చేపలు మరియు తల్లి రొయ్యలను రక్షించడానికి మరియు వాటి సంతానాన్ని పోషించడానికి… అధికారులు ఏపీలో 61 రోజుల పాటు చేపలు పట్టడంపై ఆంక్షలు విధించారు. ఈ నియమాలు ఈరోజు, ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే, చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడానికి… సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.