పెన్షన్ పొందే ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు మీరు EPFO సభ్యుడైతే, ఇది మీ కోసం మంచి అవకాశం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) మరియు ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS)కి సంబంధించి కొన్ని కీలక మార్పులు రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత జీత పరిమితి ₹15,000గా ఉన్నది, దీన్ని ₹21,000కి పెంచే అవకాశం ఉన్నదని వార్తలు చెబుతున్నాయి.
జీత పరిమితి పెరిగితే కలిగే లాభాలు ఏమిటి?
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ₹15,000 వరకు మాత్రమే బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు EPF మరియు EPS ప్రయోజనాలు పొందగలరు. ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ కలిసి వారి జీతంలో 12% చొప్పున EPFకి డిపాజిట్ చేస్తారు. యజమాని భాగంలో నుంచి 8.33% EPSకి వెళుతుంది, అయితే ఇది గరిష్టంగా ₹1,250కి పరిమితమై ఉంటుంది.
ఈ పరిమితిని ₹21,000కి పెంచితే, ఇప్పుటి వరకు EPF ప్రయోజనాలు పొందలేని ఉద్యోగులు కూడా ఇందులో చేరగలుగుతారు. అంటే ₹15,000 నుంచి ₹21,000 మధ్య జీతం ఉన్న ఉద్యోగులు కూడా ఇకపై పెన్షన్ స్కీమ్‌లో భాగమవ్వగలుగుతారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 75 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశముంది.
Related News
ఎందుకు ఇది పెద్ద చేంజ్?
జీత పరిమితి పెరిగితే, యజమానులు EPSకి అధికంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ప్రస్తుతం గరిష్టంగా ₹1,250 EPSకి వెళ్లే పెన్షన్ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ₹1,749 వరకు పెరిగే అవకాశం ఉంది. దీని వలన ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత లభించే పెన్షన్ మొత్తము పెరుగుతుంది. అదే సమయంలో ఉద్యోగి కూడా తన మొత్తం జీతం పైనే EPF కంట్రిబ్యూషన్ చేయాల్సి వస్తుంది, అంటే తన ఖాతాలోకి వెళ్లే మొత్తము కూడా ఎక్కువవుతుంది.
భవిష్యత్తులో మంచి పెన్షన్ కావాలంటే ఇది గోల్డెన్ ఛాన్స్
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం EPFO పెన్షన్ పథకంపై ఏటా ₹6,700 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇప్పుడు జీత పరిమితి పెరిగితే, ప్రభుత్వానికి మరింత నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అయినా, ఇది ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఎంతో ఉపయోగకరం. ఎప్పటికైనా మంచి పెన్షన్ కావాలంటే ఈ అవకాశాన్ని కోల్పోకండి.
ఈ మార్పులు అధికారికంగా ఆమోదం పొందిన వెంటనే లక్షల మంది ఉద్యోగుల జీవితం మారిపోతుంది.సంపూర్ణ వివరాలు కోసం ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం కోసం EPFO వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఈ మార్పులు మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వాన్ని బలంగా మార్చగలవు. మీరు ₹21,000 లోపు జీతం తీసుకుంటున్న ఉద్యోగి అయితే, మీరు త్వరలో EPF, EPS ప్రయోజనాలకు అర్హులవుతారు – ఇది మిస్సవ్వకూడని అవకాశమే.